Allu Sirish
Allu Sirish : అల్లు వారింట్లో పెళ్లి సందడి నెలకొంది. తాజాగా అల్లు శిరీష్ నిశ్చితార్థం చేసుకున్నట్టు ప్రకటించాడు. ఈఫిల్ టవర్ వద్ద తాను నిశ్చితార్థం చేసుకున్న అమ్మాయి చేయి పట్టుకొని చేతుల మధ్యలో ఈఫిల్ టవర్ కనపడేలా దిగిన ఫోటోని తన సోషల్ మీడియాలో షేర్ చేసాడు అల్లు శిరీష్.(Allu Sirish)
ఈ ఫోటోని షేర్ చేస్తూ.. నేడు మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా నా మనసుకు దగ్గరైన ఒక న్యూస్ మీకు చెప్తున్నాను. నా నిశ్చితార్థం నైనికాతో జరిగింది. మా నానమ్మ ఇటీవల మరణించింది. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని అనుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తుంది. మా కుటుంబాలు మా ప్రేమను ఆనందంతో స్వీకరించాయి అని తెలిపాడు.
దీంతో అల్లు శిరీష్ నైనికా అనే అమ్మాయిని ప్రేమించాడని, పెళ్ళికి ఇద్దరి ఇళ్లల్లో ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. ఇటీవల సైలెంట్ గా ఇరు కుటుంబసభ్యుల మధ్యే పారిస్ లో వీరి నిశ్చితార్థం జరిగినట్టు వినిపిస్తుంది. నైనికా హైదరాబాద్ అమ్మాయి అని సమాచారం. ఆ అమ్మాయి ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. మరి ఈ కొత్తజంట పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో చూడాలి. శిరీష్ తాను పెళ్లి చేసుకోబోయే నైనికాని ఎప్పుడు పరిచయం చేస్తాడో చూడాలి.
Also Read : Idli Kottu Review : ‘ఇడ్లీ కొట్టు’ మూవీ రివ్యూ.. సినిమా అంతా ఏడిపించేశారుగా.. నాన్న గుర్తొస్తాడు..