Idli Kottu Review : ‘ఇడ్లీ కొట్టు’ మూవీ రివ్యూ.. సినిమా అంతా ఏడిపించేశారుగా.. నాన్న గుర్తొస్తాడు..

తమిళనాడులో ధనుష్ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగిన ఓ కథకు కొంత కల్పిత కథ జోడించి ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించాడు. (Idli Kottu Review)

Idli Kottu Review : ‘ఇడ్లీ కొట్టు’ మూవీ రివ్యూ.. సినిమా అంతా ఏడిపించేశారుగా.. నాన్న గుర్తొస్తాడు..

Idli Kottu Review

Updated On : October 1, 2025 / 1:44 PM IST

Idli Kottu Review : ధనుష్ హీరోగా నటిస్తూ డైరెక్ట్ చేసిన సినిమా ‘ఇడ్లీ కొట్టు’. డాన్ పిక్చర్స్‌, వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్స్ పై ఆకాష్ బాస్కరన్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాలో నిత్యా మీనన్, అరుణ్ విజయ్, షాలిని పాండే, సత్యరాజ్, రాజ్‌కిరణ్.. పలువురు కీలక పాత్రల్లో నటించారు. తెలుగు, తమిళ్ లో ఒకేసారి నేడు అక్టోబర్ 1న ఈ సినిమా రిలీజ్ అయింది. తెలుగులో ఇడ్లీ కొట్టు సినిమాని శ్రీ వేదక్షర మూవీస్ బ్యానర్ పై నిర్మాత రామారావు చింతపల్లి రిలీజ్ చేశారు.(Idli Kottu Review)

కథ విషయానికొస్తే.. మురళి(ధనుష్) తండ్రి శివకేశవులు(రాజ్ కిరణ్) సొంతూళ్లో ఓ ఇడ్లి షాప్ పెట్టుకొని నడిపిస్తూ ఉంటాడు. ఆయన చేసే ఇడ్లి, ఆ షాప్ చుట్టుపక్కల ఫేమస్. మురళి హోటల్ మేనేజ్మెంట్ అయ్యాక ఇడ్లి షాప్ ని ఫ్రాంచైజ్ చేద్దాం, డబ్బు సంపాదిద్దాం, బిజినెస్ చేద్దాం అంటే శివకేశవులు ఒప్పుకోడు. మురళి లైఫ్ లో బాగా సంపాదించాలని చెప్పి తల్లితండ్రుల్ని, ఊరిని వదిలి వెళ్తాడు. కొన్నేళ్ల తర్వాత బ్యాంకాక్ లో ఓ పెద్ద కంపెనీలో హోటల్ బాధ్యతలు అన్ని చూసుకుంటూ ఉంటాడు.

ఆ కంపెనీ అధినేత(సత్యరాజ్) కూతురు మీరా(షాలిని) మురళిని ఇష్టపడి పెళ్లి చేసుకోడానికి రెడీ అవుతుంది. ఈ పెళ్లి, మురళి, అతనికి తండ్రి ఇచ్చే ఇంపార్టెన్స్ మీరా అన్న అశ్విన్(అరుణ్ విజయ్)కి నచ్చదు. మురళి పెళ్ళికి తల్లితండ్రులు రాలేము అంటారు. పెళ్లి హడావిడిలో ఉండగా మురళి తండ్రి చనిపోయాడని వార్త వస్తుంది. దీంతో మురళి సొంతూరికి బయలుదేరుతాడు. అక్కడికి వెళ్ళాక తండ్రి చనిపోయిన తెల్లారే భర్తని, ఇడ్లి కొట్టుని తలుచుకొని మురళి తల్లి కూడా చనిపోతుంది. దీంతో ఆ ఇడ్లీ షాప్ ఏమవుతుంది? మీరాతో పెళ్లి జరుగుతుందా? అశ్విన్ మురళిని ఏం చేస్తాడు? మురళి తల్లితండ్రులతో ఉండి అన్ని పనులు చేసే కళ్యాణి(నిత్యామీనన్) ఎవరు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.

Also Read : Janhvi Kapoor : ‘పెద్ది’ సినిమాపై జాన్వీ కామెంట్స్.. ఐ లవ్ రామ్ సర్ అంటూ.. ఇంకా హైప్ పెంచేసిందిగా..

సినిమా విశ్లేషణ..

ధనుష్ హీరోగా నటిస్తూ మరోసారి ఈ ఇడ్లీ కొట్టు సినిమాతో డైరెక్టర్ గా మాట్లాడాడు. తమిళనాడులో ధనుష్ అమ్మమ్మ వాళ్ళ ఊరిలో జరిగిన ఓ కథకు కొంత కల్పిత కథ జోడించి ధనుష్ ఈ సినిమాని తెరకెక్కించాడు. సినిమా అంతా నాన్న ఎమోషన్, ఆ ఇడ్లీ షాప్ ఎమోషన్ తోనే సాగుతుంది. కథ మొదలవ్వడమే ఇడ్లీ షాప్, దాని ఇంపార్టెన్స్ తో మొదలవుతుంది. హీరో బాగా డబ్బున్న వాళ్ళ దగ్గర ఓ కృత్తిమ బతుకు బతకడం సీన్స్ తో సాగి తండ్రి ఎమోషన్ తో నడుస్తుంది.

తండ్రిలా ఇడ్లీ టేస్ట్ తీసుకురావడానికి కష్టపడే సీన్స్ లో మంచి ఎమోషన్ పండించారు. అశ్విన్ మురళిని ఏదో ఒకటి చేయాలని వస్తాడు. దాంతో మురళికి సమస్యలు మొదలవుతాయి కానీ అయిపోయాయి అనుకున్న ప్రతిసారి ఇంకా అవ్వలేదా సమస్య అన్నట్టు సెకండ్ హాఫ్ లో కాస్త సాగదీశారు. సెకండ్ హాఫ్ లో అశ్విన్ ఈగో తో జరిగే సీన్స్ తప్ప సినిమా అంతా నాన్న, ఇడ్లీ కొట్టు ఎమోషన్ తోనే ఏడిపించేసారు. తండ్రి పెళ్లి, ప్రేమకథ కూడా క్యూట్ గా చూపించారు.

సినిమా అంతా ఎమోషన్ తో చూపించి క్లైమాక్స్ ని కాస్త కామెడీ చేయడంతో ఆ క్లైమాక్స్ ఇంకోలా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. అక్కడక్కడా తెలుగు డబ్బింగ్ వర్షన్ లో డైలాగ్స్ తో కామెడీ వర్కౌట్ చేసారు. తండ్రి జీవితాన్ని – కొడుకు జీవితాన్ని కంపేర్ చేస్తూ చూపించిన సీన్స్ చాలా బాగుంటాయి. సినిమా చూస్తున్నంతసేపు నాన్న గుర్తుకు రావడం ఖాయం. తండ్రి బతికున్నప్పుడు అతని మాట వినని ఓ కొడుకు ఆయన చనిపోయాక తండ్రి జ్ఞాపకాలతో ఏం చేసాడు అనే హృదయానికి హత్తుకునే ఎమోషన్ తో ఇడ్లీ కొట్టుని తెరకెక్కించారు.

idli kottu

నటీనటుల పర్ఫార్మెన్స్..

ధనుష్ మరోసారి తన న్యాచురల్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. నిత్యామీనన్ – ధనుష్ కాంబో మరోసారి బాగా వర్కౌట్ అయింది. ఒక గ్రామీణ యువతి పాత్రలో నిత్యా మీనన్ బాగా నటించింది. అరుణ్ విజయ్ ఈగో కోసం ఏదైనా చేసే నెగిటివ్ పాత్రలో అదరగొట్టాడు. తండ్రి పాత్రలో, ఒక మంచి మనిషిగా సీనియర్ నటుడు రాజ్ కిరణ్ అద్భుతంగా నటించారు. సినిమాలో నాన్న పాత్రకు జీవం పోశారు. షాలిని పాండే డబ్బున్న యువతి పాత్రలో బాగానే మెప్పించింది. సత్యరాజ్, సముద్రఖని, ఇలవరసు, బ్రిగిడ సాగా, వడివుక్కరసి, గీత కైలాసం, పార్తీబన్.. మిగిలిన తమిళ నటినలు అంతా వారి పాత్రల్లో బాగా నటించారు.(Idli Kottu Review)

Also Read : Little Hearts Review : ఓటీటీలోకి వచ్చేసిన ‘లిటిల్ హార్ట్స్’.. మూవీ రివ్యూ.. ఫుల్ గా నవ్వాల్సిందే..

సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎమోషనల్ సీన్స్ ని మరింత హైలెట్ చేసి కన్నీళ్లు తెప్పించారు. పాటలు పర్వాలేదనిపిస్తాయి. ఎడిటింగ్ బాగున్నా సెకండ్ హాఫ్ లో ల్యాగ్ కొంత కట్ చేయాల్సింది. తెలుగు డబ్బింగ్ కూడా బాగా వర్కౌట్ అయింది. తండ్రి ఎమోషన్, ఒక షాప్ ఎమోషన్ తో కూడిన ఓ కథని చక్కగా రాసుకొని తెరకెక్కించాడు దర్శకుడు. మరోసారి ధనుష్ దర్శకుడిగా సక్సెస్ అయ్యాడని చెప్పొచ్చు. నిర్మాణ పరంగా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.

మొత్తంగా ‘ఇడ్లీ కొట్టు’ సినిమా తండ్రి నడిపే ఇడ్లీ షాప్ కోసం, తండ్రి జ్ఞాపకాల కోసం కొడుకు పడే తపనని మంచి ఎమోషన్ తో చూపించి కన్నీళ్లు తెప్పించారు. ఈ సినిమాకు 3 రేటింగ్ ఇవ్వొచ్చు.

 

గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.