Allu Sirish: అను ఇమ్మాన్యుయేల్ తో తన రిలేషన్ పై అల్లు శిరీష్ స్పందన..

అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం "ఊర్వశివో రాక్షసివో". టీజర్ లో అను అండ్ శిరీష్ రొమాన్స్ తో రెచ్చిపోయారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, అందుకే అంతలా రొమాన్స్ చేసారంటూ జారుగా వార్తలు వినిపిస్తున్నాయి.

Allu Sirish: అను ఇమ్మాన్యుయేల్ తో తన రిలేషన్ పై అల్లు శిరీష్ స్పందన..

Allu Sirish Clarifies with Anu Emmanuel Relation

Allu Sirish: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం “ఊర్వశివో రాక్షసివో”. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాకు ‘విజేత’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. గీత ఆర్ట్స్-2 పథకంపై చిత్రకరణ జరుపుకుంటున్న ఈ మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేసింది.

Urvasivo Rakshasivo Teaser: ‘ఊర్వశివో రాక్షసివో’ టీజర్.. రొమాన్స్ తో రెచ్చిపోయిన శిరీష్!

టీజర్ లో అను అండ్ శిరీష్ రొమాన్స్ తో రెచ్చిపోయారు. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ, అందుకే అంతలా రొమాన్స్ చేసారంటూ జారుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా దీనిపై హీరో శిరీష్ స్పందించాడు. తమ మధ్య ప్రేమ అనే బంధం లేదు, డేటింగ్ లో ఉన్నామంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అంటూ వెల్లడించాడు.

మా ఇద్దరి అభిప్రాయాలు ఒకేలా ఉండడంతో.. సినిమాలో రొమాంటిక్ సీన్స్ చేయడానికి పెద్దగా ఇబ్బంది పడలేదు. అంతకుమించి ఇంకేమి లేదు, మేమిద్దరం మంచి స్నేహితులం మాత్రమే” అంటూ తమపై వస్తున్న వార్తలకు ముగింపు పలికాడు. ఇక ఈ సినిమా నవంబర్ 4న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.