Urvasivo Rakshasivo Teaser: అల్లు శిరీష్ ఇటీవల సినిమాలు చాలా సెలెక్టివ్‌గా చేస్తుండటంతో ఆయన సినిమా వచ్చి దాదాపు మూడేళ్లవుతోంది. ఇక ఆయన నటించిన ఓ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉన్నా, కరోనా కారణంగా అది వాయిదా పడుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ క్రమంలోనే ఈ సినిమా టైటిల్‌ను కూడా ‘ఊర్వశివో రాక్షసివో’ పేరుకు మార్చింది చిత్ర యూనిట్. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది.
Allu Sirish: ఊర్వశివో రాక్షసివో అంటూ ప్రేయసితో సరసాలాడుతోన్న మెగా హీరో!
ఈ టీజర్ ఆద్యంతం ప్రేక్షకులను అలరించే విధంగా తీర్చిదిద్దారు చిత్ర యూనిట్. ఒకే ఆఫీసులో పనిచేసే హీరోహీరోయిన్లు, ఒకరినొకరు ఇష్టపడతారు. అయితే హీరోయిన్‌తో రిలేషన్లోకి వెళ్తాడు హీరో. ఈ క్రమంలో ఆమెను ప్రేమిస్తాడు. కానీ, హీరోయిన్ మాత్రం కేవలం ఫ్రెండ్స్ గానే ఉందామని హీరోతో చెబుతోంది. ఈ ట్విస్టుతో హీరో ఏం చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఈ సినిమాలో శిరీష్ రిఫ్రెషింగ్ లుక్‌తో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఉన్నారు. అటు హీరోయిన్ అను ఇమ్మాన్యుయెల్ కూడా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తోంది. ఇక టీజర్లో ఎక్కువశాతం లిప్‌లాక్ సీన్స్, రొమాన్స్‌నే నింపేశారు చిత్ర యూనిట్.
Allu Sirish : మూములు మోటివేషన్ కాదుగా..!
వీరిద్దరి కాంబినేషన్ చూడటానికి ముచ్చటగా ఉండటంతో ఈ సినిమాలో వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సినీ వర్గాల్లోనూ క్రియేట్ అయ్యింది. వెన్నెల కిషోర్, పోసాని కృష్ణమురళి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాను నవంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. ఇక ఈ సినిమాను రాకేష్ శశి తెరకెక్కిస్తుండగా, ధీరజ్ మొగిలినేని, విజయ్‌లు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. GA2 పిక్చర్స్ బ్యానర్ ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ అయ్యింది.
10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్డేట్స్ కోసం 10TV చూడండి.