Allu Sirish : మూములు మోటివేషన్ కాదుగా..!

అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్.. కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు..

Allu Sirish : మూములు మోటివేషన్ కాదుగా..!

Allu Sirish

Allu Sirish: అల్లు వారి యంగ్ హీరో అల్లు శిరీష్.. కళ్లు చెదిరే ఫిజిక్‌తో అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు.. వర్కౌట్స్ ఎలా చేయాలి, ఫిట్‌గా ఎలా ఉండాలి.. అనే విషయంపై శిరీష్ అందరికీ తన వీడియోల ద్వారా మోటివేషన్ ఇస్తున్నారు.

అలాగే తన వర్కౌట్స్ ఎలా సాగుతున్నాయి.. ఫిజికల్ ఫిట్‌నెస్ కోసం ఈయన చేసిన ప్రయత్నంలోని ప్రయాణం గురించి తెలియజేస్తూ ‘ట్రైనింగ్ డే’ పేరుతో సోషల్ మీడియాలో శిరీష్ ఓ ఫిట్‌నెస్ వీడియో అప్‌లోడ్ చేశారు. దీనికి మంచి రెస్పాన్స్ వస్తుంది.

Prema Kadanta : అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ప్రేమ కాదంట’..

ఫస్ట్ వీడియోలో బ్యాక్ వర్కౌట్స్ గురించి చూపించారు. జిమ్‌లో ఈయన ఎంత కష్టపడ్డారు అనేది ఈ వీడియోలో క్లియర్‌గా కనిపిస్తుంది. ముందుగా వామప్ చేసిన తర్వాత.. ఒక్క చేతితో డంబెల్స్ లిఫ్ట్ చేయడంతో.. జిమ్‌కు సంబంధించిన ఇంకా చాలా అంశాలు ఇందులో చూపించారు.

ఈ వర్కౌట్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసి.. దాంతో పాటు అభిమానుల కోసం మనసులో మాట రాసుకొచ్చారు అల్లు శిరీష్. తన వర్కవుట్ షెడ్యూల్‌లో చాలా రకాల ఫిట్ నెస్ సూత్రాలు ఉన్నాయి. ఈ డిజిటల్ సిరీస్‌లో కేవలం జిమ్ ట్రైనింగ్, ఫిట్‌నెస్ మాత్రమే కాకుండా యోగా, బాక్సింగ్‌కు సంబంధించిన విషయాలు కూడా చూపించబోతున్నారు.

Allu Sirish : అల్లు శిరీష్ మేకోవర్ అదిరిందిగా..!

తనకు తాను గోల్స్ సెట్ చేసుకుని ఫిట్‌నెస్ పరంగా వాటిని చేరుకుంటున్నారు శిరీష్. ఇప్పుడు తన ఫాలోవర్స్ కోసం కూడా వీడియోలు పోస్ట్ చేసి .. ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు అల్లు శిరీష్.