Prema Kadanta : అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ప్రేమ కాదంట’..

అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు..

Prema Kadanta : అల్లు శిరీష్ కొత్త సినిమా ‘ప్రేమ కాదంట’..

Prema Kadanta: ‘కొత్త జంట’, ‘శ్రీరస్తు శుభస్తు’, ‘ఏబిసిడి’ వంటి సూపర్ హిట్ సినిమాలతో, ‘ఒక్క క్షణం’ వంటి డిఫరెంట్ మూవీతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో అల్లు శిరీష్.. ఇప్పుడు ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నారు.

అల్లు శిరీష్, మ‌ల్లూ బ్యూటీ అను ఇమ్మానుయెల్ జంటగా.. రాకేష్ శశి దర్శకత్వంలో, మెగాప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో.. ‘100% ల‌వ్’, ‘భలే భ‌లే మ‌గాడివోయ్’, ‘గీత‌గోవిందం’, ‘ప్ర‌తిరోజూ పండుగే’ వంటి స‌క్సెస్ ఫుల్ చిత్రాల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా మారిన నిర్మాణ సంస్థ జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ మీద ఈ సినిమా రూపొందుతుంది.

అల్లు శిరీష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ సినిమాకి ‘ప్రేమ కాదంట’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. అను, శిరీష్ పెయిర్ అండ్ కెమిస్ట్రీ బాగుంది. ఇద్దరూ ప్రేమ పరవశంలో మునిగి తేలుతూ.. తన్మయత్వంతో ముద్దు పెట్టుకుంటున్న పోస్టర్స్ ఆకట్టుకుంటున్నాయి..