NTR – Trivikram : మళ్ళీ కలిసి కనపడబోతున్న ‘అరవింద సమేత’ కాంబో.. ఒకే స్టేజిపై ఎన్టీఆర్, త్రివిక్రమ్?

టిల్లు స్క్వేర్ సక్సెస్ మీట్ రేపు ఏప్రిల్ 8న నిర్వహిస్తుండగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్టు ప్రకటించారు.

Along with NTR Trivikram also Coming to Tillu Square Success Meet Rumours goes Viral

NTR – Trivikram : ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబోలో అరవింద సమేత వీరరాఘవ సినిమా వచ్చి మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత కూడా వీరి కాంబోలో ఒక సినిమా ప్రకటించారు. కానీ అనివార్య కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోవడంతో త్రివిక్రమ్ గుంటూరు కారం సినిమా చేయగా, ఎన్టీఆర్ దేవర ఓకే చేశారు. తన కష్టకాలంలో త్రివిక్రమ్ చాలా సపోర్ట్ ఉన్నాడని ఓ ఈవెంట్లో తెలిపాడు ఎన్టీఆర్. అరవింద సమేత తర్వాత మళ్ళీ వీరిద్దరూ కలిసి పబ్లిక్ మీటింగ్స్ లో కనపడలేదు.

కానీ ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే స్టేజిపైకి రాబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా వచ్చిన టిల్లు స్క్వేర్(Tillu Square) సినిమా భారీ విజయం సాధించి 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సినిమా సక్సెస్ మీట్ రేపు ఏప్రిల్ 8న నిర్వహిస్తుండగా ఈ ఈవెంట్ కి ఎన్టీఆర్ గెస్ట్ గా రాబోతున్నట్టు ప్రకటించారు.

అయితే టిల్లు స్క్వేర్ సినిమాని నిర్మాత నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ తో పాటు త్రివిక్రమ్ భార్య సౌజన్య ఫార్ట్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్ పై కలిసి నిర్మించారు. దీంతో సౌజన్య పేరు ముందు ఉంచినా త్రివిక్రమ్ కనిపిస్తారు. గతంలో కూడా ఫార్ట్యూన్ ఫోర్, సితార సినిమాల ప్రమోషన్స్ కి త్రివిక్రమ్ వచ్చారు. అలాగే టిల్లు స్క్వేర్ కథ ఫైనల్ చేసే ప్రాసెస్ లో త్రివిక్రమ్ కూడా హెల్ప్ చేసారంట. దీంతో ఈ ఈవెంట్ కి త్రివిక్రమ్ కూడా ఆ సినిమా నిర్మాతగా రాబోతున్నట్టు సమాచారం.

Also Read : Ram Charan Family : చిన్ని ఏనుగుతో సరదాగా చరణ్, క్లిన్ కారా, ఉపాసన.. వైరల్ అవుతున్న క్యూట్ ఫొటో.. రైమ్ కూడా..

దీంతో ఎన్టీఆర్ – త్రివిక్రమ్ ఇద్దరూ మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఒకే స్టేజిపై కనిపించనున్నారు. టిల్లు స్క్వేర్ ఈవెంట్ కోసం ఈ ఇద్దరూ వచ్చి సందడి చేయనున్నారు. ఇద్దరి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ ఈ ఈవెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇద్దరూ ఈవెంట్ కి వస్తే ఎన్టీఆర్ త్రివిక్రమ్ గురించి ఏం మాట్లాడతాడు? త్రివిక్రమ్ ఎన్టీఆర్ గురించి ఏం మాట్లాడతారో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.