Ram Charan Family : చిన్ని ఏనుగుతో సరదాగా చరణ్, క్లిన్ కారా, ఉపాసన.. వైరల్ అవుతున్న క్యూట్ ఫొటో.. రైమ్ కూడా..

చరణ్, ఉపాసన బ్యాంకాక్ వెకేషన్ ఫొటోలు రైమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.

Ram Charan Family : చిన్ని ఏనుగుతో సరదాగా చరణ్, క్లిన్ కారా, ఉపాసన.. వైరల్ అవుతున్న క్యూట్ ఫొటో.. రైమ్ కూడా..

Ram Charan Upasana Klin Kaara Bangkok Vacation Photos goes Viral

Updated On : April 7, 2024 / 11:01 AM IST

Ram Charan Family : రామ్ చరణ్ ఇటీవల తన ఫ్యామిలీతో పాటు పలువురు స్నేహితులతో కలిసి బ్యాంకాక్ కి సమ్మర్ వెకేషన్ కి వెళ్లారు. చరణ్, ఉపాసన, క్లిన్ కారా, చరణ్ కుక్క పిల్ల రైమ్ వెకేషన్ లో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. తాజాగా నిన్న రాత్రి చరణ్ బ్యాంకాక్ నుంచి హైదరాబాద్ కి తిరిగొచ్చారు. అయితే బ్యాంకాక్ వెకేషన్ ఫొటోలు రైమ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఈ ఫోటోలని షేర్ చేస్తూ.. థ్యాంక్యూ నాన్న, బ్యాంకాక్ లో బాగా ఎంజాయ్ చేసాను, స్విమ్ చేసాను, చెల్లి క్లిన్ కారాతో ఆడుకున్నాను, నేను కొత్త థాయ్ కట్ చేయించుకున్నాను అంటూ క్యూట్ గా పోస్ట్ చేశారు.

ఈ ఫొటోల్లో కుక్క పిల్ల రైమ్ సరదాగా నీళ్ళల్లో ఆడుకుంటుంది. ఓ ఫొటోలో చిన్ని ఏనుగుకి చరణ్ వాటర్ పోస్తుంటే ఉపాసన క్లిన్ కారాని ఎత్తుకొని ఆ ఏనుగు పిల్లకు స్నానం చేయిస్తుంది. మరో ఫొటోలో రైమ్ ని అక్కడి బ్యాంకాక్ వాళ్ళు ఎత్తుకున్నారు. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.

Also Read : Samantha : వామ్మో సమంత ఈ రేంజ్‌లో బాడీ పెంచుతుంది ఏంటి? ఫుల్ ఫిట్నెస్ మోడ్‌లో సమంత..

చిన్ని ఏనుగు పిల్లకి చరణ్ ఫ్యామిలీ స్నానం చేయిస్తున్న ఫొటో మాత్రం తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ ఫొటోలో క్లిన్ కారా కూడా క్లియర్ గా కనిపిస్తుండటంతో చరణ్ అభిమానులు సంతోషిస్తున్నారు. మొత్తానికి చరణ్ బ్యాంకాక్ సమ్మర్ వెకేషన్ పూర్తి చేసుకొని రిటర్న్ అయ్యాడు. త్వరలో గేమ్ ఛేంజర్ షూట్ లో జాయిన్ అవ్వనున్నాడు చరణ్.