మరోసారి బోల్డ్ పాత్రలో అమలాపాల్

  • Publish Date - August 13, 2020 / 09:48 AM IST

అమలాపాల్ మరోసారి బోల్డ్ పాత్రలో ప్రేక్షకులకు కనిపించనుంది. సినిమాలో కాదు..వెబ్ సిరీస్ కు కోసం అమలాపాల్ ఒప్పుకుందని తెలుస్తోంది. ఇటీవలే వచ్చిన ‘ఆమె సినిమాలో ఈమె బోల్డ్ గా నటించిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మరోసారి నటించబోతోంది. 1970 నాటి కథతో రూపొందనుంది. తెలుగు, తమిళ భాషలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. అప్పటి పరిస్థితులను తెలియచెప్పే విధంగా బోల్డ్ గా తెరకెక్కించనున్నారని సమాచారం. అమలాపాల్ కీ రోల్. బాలీవుడ్ లో మహేష్ భట్, జియో స్టూడియోస్ సంయుక్తంగా తెరకెక్కించనున్న..వెబ్ సిరీస్ లో అమలా నటించనున్నారు. దీని ద్వారా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

కరోనా లాక్ డౌన్ కారణంగా… సినిమా థియేటర్లు మూతపడడంతో మొబైల్ కు వచ్చేశారు. వెబ్ సిరీస్ లు, వెబ్ సినిమాలు అంటూ ఆలోచిస్తున్నారు. హీరోలు ఇప్పటికే నటిస్తున్నారు కూడా. హీరోయిన్లు కూడా అదే దారి ఎంచుకుంటున్నారు.

సమంత ఇప్పటికే ఫ్యామిలీ మ్యాన్ 2 చేయగా, నిత్యా మీనన్, సాయి పల్లవి, కాజల్ అగర్వాల్, తమన్నా..ఇప్పటికే ఈ ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

అమలాపాల్ తెలుగు సినిమాల్లో తక్కువగా నటించినా…క్రేజ్ మాత్రం విపరీతంగా వచ్చేసింది. రామ్ చరణ్ తేజ నటించిన ‘నాయక్’, అల్లు అర్జున్ ‘ఇద్దరు అమ్మాయిలతో’ సినిమాలో నటించి మెప్పించింది.