Amala Paul marries Jagat Desai at Kochi today
Amala Paul : ఇటీవల నటి అమలా పాల్ తన బాయ్ ఫ్రెండ్ తో పెళ్లి జీవితానికి ఓకే చెప్పిన సంగతి అందరికి తెలిసిందే. అమలా పాల్ బర్త్ డే రోజు బాయ్ ఫ్రెండ్ జగత్ దేశాయ్.. ఆమెకు ప్రపోజ్ చేయడం, ఆమె వెంటనే ఓకే చెప్పడం జరిగిపోయింది. అందుకు సంబంధించిన వీడియోని ఇద్దరు కలిసి తమ సోషల్ మీడియాలో పోస్టు చేయగా బాగా వైరల్ అయ్యింది. ఇక ఇలా ప్రపోజల్ కి ఒకే చెప్పిందో లేదో వెంటనే పెళ్లి పీటలు ఎక్కేసారు.
కోచిలో నవంబర్ 5న వీరిద్దరి వివాహం జరిగిందట. అందుకు సంబంధించిన ఫోటోలను కూడా అమలాపాల్ అండ్ జగత్ దేశాయ్ నెట్టింట షేర్ చేస్తూ తెలియజేశారు. అమలాపాల్ కి ఇది రెండో పెళ్లి. 2014 లో డైరెక్టర్ విజయ్‌ని ప్రేమించి పెళ్లి చేసుకున్న అమలాపాల్.. విభేదాల కారణంగా 2017 లో అతడి నుంచి విడిపోయింది. ఆ తరువాత 2018 లో తన స్నేహితుడు సింగర్ భవీందర్ సింగ్‌ను అమలాపాల్ పెళ్లాడినట్లు వార్తలు వచ్చాయి. వాళ్లిద్దరికి పెళ్లి జరిగినట్లు ఓ ఫోటో కూడా మీడియాల్లో చక్కెర్లు కొట్టింది.
Also read : Narakasura : ఒక టికెట్ పై ఇద్దరికీ సినిమా.. ‘నరకాసుర’ బంపర్ ఆఫర్..
అయితే ఆ ఫోటో ఓ షూట్‌లో భాగమని చెప్పి పెళ్లి వార్తలను కొట్టేసారు. ఆ తర్వాత భవీందర్ సింగ్ తో కూడా విభేదాలు వచ్చి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళింది అమలా పాల్. ఇక కొన్నాళ్లుగా జగత్ దేశాయ్‌తో డేటింగ్ చేస్తున్న ఈ భామ.. అతడితో ఉన్న ప్రేమ ప్రయాణాన్ని పెళ్లికి తీసుకోని వెళ్లి కొత్త జీవితాన్ని మొదలు పెట్టింది. కాగా ఈ జంటకి సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.