Narakasura : ఒక టికెట్ పై ఇద్దరికీ సినిమా.. ‘నరకాసుర’ బంపర్ ఆఫర్..

‘పలాస' ఫేమ్ రక్షిత్ అట్లూరి చాలా గ్యాప్ తర్వాత ‘నరకాసుర’ సినిమా. తాజాగా ఈ మూవీ మేకర్స్ ఆడియన్స్ కోసం..

Narakasura : ఒక టికెట్ పై ఇద్దరికీ సినిమా.. ‘నరకాసుర’ బంపర్ ఆఫర్..

Rakshit Atluri starrer Narakasura movie ticket offer in theater

Updated On : November 5, 2023 / 4:56 PM IST

Narakasura : ‘పలాస’ ఫేమ్ రక్షిత్ అట్లూరి చాలా గ్యాప్ తర్వాత ‘నరకాసుర’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. సెబాస్టియన్ నోవా అకోస్టా డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా నటించారు. సుముఖ క్రియేషన్స్, ఐడియల్ ఫిలిం మేకర్స్ బ్యానర్స్ లో డాక్టర్ అజ్జా శ్రీనివాస్ నిర్మించిన ఈ సినిమా నవంబర్ 3న ప్రేక్షకుల ముందుకి వచ్చింది. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మళయాల, కన్నడ భాషల్లో కూడా ‘నరకాసుర’ రిలీజ్ అయింది.

థియేటర్ లో ఈ మూవీ మంచి రెస్పాన్స్ వస్తుంది. హీరో రక్షిత్ నటనకి మంచి మార్కులు పడుతున్నాయి. ఈ మూవీకి వస్తున్న రివ్యూస్ పట్ల చిత్ర యూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని మెసేజ్ కి విమర్శకుల ప్రశంసలు అందుతున్నాయి. ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీని మరింత మంది ప్రేక్షకులకు దగ్గర చేయాలని నరకాసుర మూవీ యూనిట్ ఒక నిర్ణయం తీసుకుంది. ఈ సోమవారం నుంచి గురువారం వరకు ఒక టికెట్ మీద ఇద్దరు ప్రేక్షకులు సినిమా చూసేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.

Also read : Sivaji : రీ రిలీజ్‌కి సిద్దమవుతున్న శివాజీ ది బాస్.. ఎప్పుడో తెలుసా..?

ఇక ఈ సినిమాలో తన నటనకి వస్తున్న ప్రశంసలకు రక్షిత్ కృతజ్ఞతలు తెలియజేశాడు. అలాగే ఈ సినిమాని ఇంకా చూడని వారు థియేటర్స్ లో చూసి.. తాము చేసిన ప్రయత్నాన్ని గెలిపించామని కోరాడు. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తమిళనాడు, ఆంధ్ర బోర్డర్ లో కాఫీ, మిరియాలు పండించే ఓ గ్రామంలో జరిగే కథ. కాఫీ ఎస్టేట్ ఓనర్ దగ్గర లారీ డ్రైవర్ గా పని చేసే హీరో.. సడన్ గా ఒక రోజు అదృశ్యమవుతాడు. ఈ సినిమాలో ట్రాన్సజెండర్స్ కథ ఏంటి..? వారి కోసం హీరో ఎందుకు పోరాడాడు? అనేది తెరపై చూడాల్సిందే.