Amala Paul : హిందువు కాదంటూ అమలాపాల్‌కి ఆలయ ప్రవేశం నిరాకరణ..

మలయాళ సినిమాలతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ 'అమలాపాల్'. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఈ హీరోయిన్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది.

Amala Paul : మలయాళ సినిమాలతో వెండితెరకు పరిచయమైన హీరోయిన్ ‘అమలాపాల్’. మళయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి అలరించింది. ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అమలాపాల్ చేతిలో ప్రెజెంట్ అరడజనకు పైగా చిత్రాలు ఉన్నాయి. యాక్టర్ గానే కాకుండా నిర్మాతగా ప్రొడక్షన్ కంపెనీ మొదలు పెట్టి పలు సినిమాలను నిర్మిస్తుంది. వీటితో పాటు వెబ్ సిరీస్ అండ్ టెలివిజన్ షోస్ లో కూడా నటిస్తూ వస్తోంది.

Amala Paul: తన మాజీ ప్రియుడు లైంగిక వేధింపులు చేస్తున్నాడంటూ పోలీసులను ఆశ్రయించిన అమలా పాల్

తాజాగా ఈ హీరోయిన్ కి ఒక చేదు అనుభవం ఎదురైంది. కేరళలోని ఎర్నాకులంలో ఉన్న తిరువైరానికులం మహాదేవ ఆలయాన్ని దర్శించుకోడానికి వెళ్లిన అమలాపాల్ ని ఆలయ నిర్వాహకులు అడ్డుకున్నారు. ఈ ఆలయంలో హిందూవులకు మాత్రమే అనుమతి ఉంది. మీరు క్రిస్టియన్ అంటూ ఆలయ పూజారులు ఆమెను అడ్డుకున్నారు. దీంతో అమలాపాల్ ఆలయం ముందు నుంచే దేవుడికి మొక్కుకొని అక్కడి నుంచి వెళ్లిపోయింది. అయితే ఈ విషయాన్ని ఆలయం విజిటర్ బుక్‌లో ఎంటర్ చేసింది.

నన్ను ఆలయంలోకి అనుమతించక పోయినా మనస్సులోనే ప్రార్ధించుకొని దేవుని అశీసులు పొందినట్లు చెప్పుకొచ్చింది. 2023లో కూడా ఇంకా మతపరమైన వివక్ష కొనసాగడం చాలా బాధాకరమని. ఈ వివక్ష వెంటనే తొలిగించాలి అంటూ రాసుకొచ్చింది. లౌకిక రాజ్యమని చెప్పుకుంటూ ఈ వివక్ష ఏంటని ఘాటు ప్రశ్నలు వేసింది. ప్రస్తుతం ఈ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. మరి దీని పై అక్కడి అధికారులు ఏమన్నా చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాలి.

కాగా అమలాపాల్ ప్రస్తుతం మలయాళంలో మూడు సినిమాల్లో నటిస్తుంది. ఇందిలో ఒకటి మమ్ముట్టి హీరోగా తెరకెక్కుతున్న ‘క్రిస్టోఫర్’. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. అలాగే తమిళంలో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ, హిందీలో అజయ్ దేవగన్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘భోళా’ సినిమాలో కూడా నటిస్తుంది.

ట్రెండింగ్ వార్తలు