Amardeep – Nikhil : నేను నడవలేని స్థితిలో ఉన్నా.. నన్ను ఎత్తుకొని వాష్ రూమ్ తీసుకెళ్లాడు.. వీళ్లిద్దరి మధ్య ఇంత స్నేహం ఉందా..

నిఖిల్ కోసం అతని తండ్రితో పాటు నటుడు అమర్ దీప్ కూడా వచ్చాడు.

Amardeep Interesting Comments on Nikhil in Bigg Boss

Amardeep – Nikhil : సీరియల్స్ తో పాపులారిటీ తెచ్చుకొని పలు టీవీ షోలతో వైరల్ అయ్యారు అమర్ దీప్, నిఖిల్. అమర్ దీప్ గతంలో బిగ్ బాస్ లో పాల్గొని ఇప్పుడు సినిమాలు కూడా చేస్తున్నాడు. ఇక నిఖిల్ ఈ సీజన్ లో బిగ్ బాస్ లోకి వెళ్ళాడు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ సీజన్ 8 నడుస్తుంది. నిన్న ఆదివారం ఎలాంటి ఎలిమినేషన్ లేకుండా సర్ ప్రైజ్ ఇచ్చాడు నాగార్జున.

అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కోసం వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒకరు, వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒకరు షోకు వచ్చారు. ఈ క్రమంలో నిఖిల్ కోసం అతని తండ్రితో పాటు నటుడు అమర్ దీప్ కూడా వచ్చాడు. అమర్ దీప్ ఓ సంఘటన గురించి చెప్తూ వాళ్లిద్దరూ ఎంత మంచి స్నేహితులో తెలిపాడు.

Also Read : Nayanthara : నయనతార కొత్త సినిమా అనౌన్స్.. ‘రక్కయి’ నయన్ మాస్ పర్ఫార్మెన్స్.. టీజర్ అదిరిందిగా..

అమర్ దీప్ మాట్లాడుతూ.. ఓ షో షూటింగ్ తర్వాత నా రెండు కాళ్ళు బాగా నొప్పి వచ్చి నడవలేని స్థాయిలో ఉన్నాను. దాంతో నిఖిల్ షో నుంచి ఇంటికి వెళ్లకుండా నన్ను నా రూమ్ కి తీసుకువెళ్లాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నేను కదల్లేని స్థితిలో ఉంటే వాష్ రూమ్ కి కూడా నన్నుఎత్తుకొని తీసుకెళ్లాడు. నిఖిల్ ఫ్రెండ్షిప్ కి అంత విలువ ఇస్తాడు అంటూ తెలిపాడు. దీంతో వీరి ఫ్యాన్స్ వీరిద్దరి మధ్య ఇంత మంచి స్నేహం ఉందా అని ఆశ్చర్యపోతున్నారు.