Nayanthara : నయనతార కొత్త సినిమా అనౌన్స్.. ‘రక్కయి’ నయన్ మాస్ పర్ఫార్మెన్స్.. టీజర్ అదిరిందిగా..

నయనతార మెయిన్ లీడ్ గా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ కొత్త సినిమాని ప్రకటించారు.

Nayanthara : నయనతార కొత్త సినిమా అనౌన్స్.. ‘రక్కయి’ నయన్ మాస్ పర్ఫార్మెన్స్.. టీజర్ అదిరిందిగా..

Nayanthara New Movie Rakkayie Teaser Released

Updated On : November 18, 2024 / 10:22 AM IST

Nayanthara : నేడు నయనతార పుట్టిన రోజు కావడంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు, నెటిజన్లు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా నేడు ఆమె పుట్టిన రోజు సందర్భంగా నయనతార మెయిన్ లీడ్ గా చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ కొత్త సినిమాని ప్రకటించారు. ఈ సినిమాకు రక్కయి అనే టైటిల్ ని ప్రకటించారు. అలాగే టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసారు.

Also Read : Mahesh Babu : గడ్డం తీసేసిన మహేష్ బాబు.. వెనకాలే రాజమౌళి.. SSMB 29 సినిమా సంగతేంటి..?

రక్కయి టీజర్లో.. నయన్ ఏడుస్తున్న చిన్న బాబుని పడుకోబెట్టి ఆ తర్వాత తన మీదకు దాడికొచ్చిన వాళ్లపై సింగిల్ గా పోరాటం చేసింది. కర్ర, కత్తి పట్టుకొని చీరలో మాస్ పర్ఫార్మెన్స్ చేసింది నయన్. యాక్షన్ అదరగొట్టేసింది. టీజర్ చూస్తుంటే ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో యాక్షన్ డ్రామాగా ఉండబోతుందని తెలుస్తుంది. మీరు కూడా నయన్ కొత్త సినిమా రక్కయి టీజర్ చూసేయండి..