Mahesh Babu : గడ్డం తీసేసిన మహేష్ బాబు.. వెనకాలే రాజమౌళి.. SSMB 29 సినిమా సంగతేంటి..?

తాజాగా మహేష్ బాబు కీరవాణి కొడుకు శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యాడు.

Mahesh Babu : గడ్డం తీసేసిన మహేష్ బాబు.. వెనకాలే రాజమౌళి.. SSMB 29 సినిమా సంగతేంటి..?

Mahesh Babu Removes his Beard before Starting Rajamouli Movie Photo goes Viral

Updated On : November 18, 2024 / 9:51 AM IST

Mahesh Babu : మహేష్ బాబు త్వరలో రాజమౌళితో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రాజమౌళి రైటింగ్ పార్ట్ పూర్తి చేసి లొకేషన్స్ వేటలో పడ్డారు. ఇటీవలే కెన్యా నుంచి పలు లొకేషన్స్ ని తన సోషమీడియాలో పోస్ట్ చేసారు. ఇక మహేష్ బాబు కూడా ఈ సినిమా కోసం లుక్స్, బాడీ పరంగా సిద్దమవుతున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా మహేష్ బయట కనిపిస్తే ఫుల్ జుట్టు, గడ్డంతో కనపడేవాడు. దీంతో రాజమౌళి సినిమా లుక్ కోసం ఇలా పెంచుతున్నాడు అని టాక్ వచ్చింది.

Also See : Nayanthara : నయనతార బర్త్ డే స్పెషల్.. ఫ్యామిలీతో క్యూట్ ఫోటోలు చూశారా?

అయితే తాజాగా మహేష్ బాబు కీరవాణి కొడుకు శ్రీ సింహ ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ కు హాజరయ్యాడు. ఈ ఈవెంట్ కు రాజమౌళి కూడా వచ్చారు. ఈ ఈవెంట్ నుంచి మహేష్ బాబు ఫోటో ఒకటి లీక్ అయింది. అయితే ఇన్ని రోజులు ఫుల్ గడ్డంతో కనపడిన మహేష్ ఈ ఫొటోలో అసలు గడ్డం లేదు. హెయిర్ స్టైల్ కూడా కొంచెం ఛేంజ్ చేసినట్టు తెలుస్తుంది. దీంతో మహేష్ కొత్త లుక్ వైరల్ గా మారింది. ఇక లీక్ అయిన మహేష్ ఫొటోలో వెనక రాజమౌళి కూడా ఉన్నాడు.

Image

ఇన్నాళ్లు రాజమౌళి సినిమా కోసం అని ఫుల్ గడ్డం పెంచిన మహేష్ అసలు సినిమా మొదలవ్వకముందే గడ్డం తీసేసాడు ఎందుకు? మళ్ళీ గడ్డం పెంచుతాడా? అసలు SSMB 29లో మహేష్ బాబు లుక్ ఏంటి? రాజమౌళి – మహేష్ ఈ సినిమాని ఏం చేయబోతున్నారో అని అంతా సందేహం వ్యక్తపరుస్తున్నారు. మొత్తానికి సినిమా అసలు మొదలుపెట్టకుండానే మహేష్ – రాజమౌళి సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.