Amardeep Mother : పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులు.. బాధతో అమర్ దీప్ తల్లి వీడియో..

అమర్ దీప్ కుటుంబాన్ని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులకు గురి చేస్తున్నారట. దీని గురించి తెలియజేస్తూ అమర్ దీప్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు.

Amardeep Mother fires on pallavi prashanth comments

Amardeep Mother : బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 7 ఆరు వారాలు విజ‌య‌వంతంగా పూర్తి చేసేసుకుంది. ఆరో వారంలో వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ కొత్త కంటెస్టెంట్స్ ఎంట్రీ ఇవ్వడం, వారిలో ఒకరు న‌య‌ని పావ‌ని ఒక వీక్ లోనే ఎలిమినేట్ అవ్వడం జరిగింది. కాగా ఈ సీజన్ లో పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ మధ్య గొడవలు జరుగుతూ వస్తున్నాయి. అయితే ఈ గొడవలను తీసుకోని బయట ఉన్న కొందరు అభిమానులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. అమర్ దీప్ కుటుంబాన్ని పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ వేధింపులకు గురి చేస్తున్నారట.

ఈ వేధింపులు గురించి తెలియజేస్తూ అమర్ దీప్ తల్లి ఒక వీడియో రిలీజ్ చేశారు. పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని చెబుతూ.. కొందరు అమర్ దీప్ కుటుంబంలోని ఆడవారి పై అసభ్యంగా కామెంట్స్ చేస్తున్నారంటూ అమర్ దీప్ తల్లి బాధ పడ్డారు. మీకు అభిమానం ఉంటే.. అతనికి ఓటు వేసి గెలిపించుకోండి. అంతేగాని ఇలా ఇతర కుటుంబంలోని ఆడవారి పై అసహ్య కామెంట్స్ చేయడం ఏం సంస్కారం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే నాగార్జున దృష్టికి దీనిని తీసుకు వెళ్తాను అంటూ కూడా ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది.

Also read : Rajendra Prasad : రాజేంద్రప్రసాద్‌ చిన్నప్పటి కన్నీటికథ.. అమ్మ కోసం ఎదురుచూపుతో ప్రాణాలు మీదకు..

ఇది ఇలా ఉంటే, ఈ వారం నామినేషన్స్ చాలా గరం గరంగా జరిగాయి. సందీప్‌, అమ‌ర్ దీప్‌ల‌ను ప్ర‌శాంత్ నామినేట్ చేశాడు. ఈక్రమంలోనే ఆట‌ సందీప్, పల్లవి ప్రశాంత్ మధ్య మాటలు యుద్ధం జరిగింది. ఇక హౌస్ లోని అశ్విని.. అమ‌ర్‌ను ప‌దే ప‌దే ప్ర‌శాంత్ అని పిలిచింది. దీంతో అమ‌ర్ కాస్త అస‌హ‌నానికి లోనయ్యి ఆమె పై కోపం వ్యక్తం చేశాడు. కాగా ఈ నామినేషన్స్ ప్రక్రియ మొత్తం పూర్తిగా అవ్వలేదు. సోమవారం సగం మాత్రమే చూపించారు. నేడు మంగళవారం మిగిలినది చూపించనున్నారు.