Amardeep – Supritha : అమర్‌దీప్ – సుప్రీత సినిమా.. ఫస్ట్ సాంగ్ వచ్చేసింది..

మీరు కూడా ఈ పాటను వినేయండి..

Amardeep - Supritha

Amardeep – Supritha : బిగ్ బాస్ ఫేమ్ అమర్‌దీప్ చౌదరి – నటి సురేఖ వాణి కూతురు సుప్రీత నాయుడు జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి’. ఎమ్3 మీడియా బ్యానర్ పై మహా మూవీస్ సౌజన్యంతో మహేంద్ర నాథ్ కూండ్ల నిర్మాణంలో మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది.

Also Read : Sridevi : తమిళ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ‘కోర్ట్’ భామ..

ఆల్రెడీ ఈ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా మొదటి పాటను రిలీజ్ చేసారు. ఎంత ముద్దుగున్నావే.. అంటూ సాగిన ఈ పాటను కెవిజె దాస్ సంగీత దర్శకత్వంలో బండి సత్యం రాయగా రఘు కుంచె పాడారు. మీరు కూడా ఈ పాటను వినేయండి..

ఈ పాటను అమెరికాలో జరిగిన తానా, నాట్స్ వేడుకలలో రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా నిర్మాత మహేంద్ర నాథ్ కూండ్ల మాట్లాడుతూ.. చౌదరి గారి అబ్బాయి తో నాయుడు గారి అమ్మాయి సినిమా నుంచి ‘ఎంత ముద్దుగున్నావే..’ అనే మొదటి పాటను అమెరికాలో వైభవంగా జరుగుతున్న తానా మరియు నాట్స్ మహాసభల్లో వేలాదిమంది ప్రవాస భారతీయుల మధ్య రిలీజ్ చేసాం. ఈ పాట అందరికి నచ్చింది. త్వరలోనే సినిమా రిలీజ్ డేట్ ప్రకటిస్తాం అని తెలిపారు.