Sridevi : తమిళ్ లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసిన ‘కోర్ట్’ భామ..
ఇప్పుడు శ్రీదేవి ఏకంగా తమిళ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.

Sridevi
Sridevi : కోర్ట్ సినిమాతో ఒక్కసారిగా బోల్డంత పాపులారిటీ తెచ్చుకుంది నటి శ్రీదేవి. కోర్ట్ సినిమాలో తన నటనకు మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఫ్యూచర్ లో ఈ భామకు మంచి అవకాశాలే వస్తాయని అంతా భావించారు. ఇప్పుడు శ్రీదేవి ఏకంగా తమిళ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.
Also Read : Smriti Irani : మళ్లీ బుల్లితెరపైకి కేంద్ర మాజీ మంత్రి.. 25 ఏళ్ళ తర్వాత అదే పాత్రతో.. ఫస్ట్ లుక్ లీక్..
కేజేఆర్ హీరోగా శ్రీదేవి హీరోయిన్ గా కొత్త సినిమా నేడు ప్రారంభమయింది. మినీ స్టూడియో సంస్థ బ్యానర్ పై 15వ సినిమాగా రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు నేడు ఉదయం చెన్నైలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలుకానుంది. ‘కోర్ట్’ తో మెప్పించిన శ్రీదేవి ఇప్పుడు తమిళ్ లో హీరోయిన్ గా ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి.
Also Read : Producer SKN Birthday : రాజాసాబ్ సెట్స్ లో నిర్మాత SKN పుట్టిన రోజు వేడుకలు.. ప్రభాస్ ఎక్కడ..?