Smriti Irani : మళ్లీ బుల్లితెరపైకి కేంద్ర మాజీ మంత్రి.. 25 ఏళ్ళ తర్వాత అదే పాత్రతో.. ఫస్ట్ లుక్ లీక్..
రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు, సీరియల్స్ కు దూరమయింది స్మృతి ఇరానీ.

Smriti Irani
Smriti Irani : సినీ,టీవీ పరిశ్రమకు చెందిన సెలబ్రిటీలు చాలామంది రాజకీయాల్లో రాణిస్తున్నారు. వారిలో స్మృతి ఇరానీ ఒకరు. మోడల్ గా కెరీర్ మొదలు పెట్టి నటిగా మారి బాలీవుడ్ లో అనేక సీరియల్స్ తో ఫేమ్ తెచ్చుకుంది స్మృతి ఇరానీ. పలు సినిమాల్లో కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. తెలుగులో జై బోలో తెలంగాణ సినిమాలో కూడా నటించింది. రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలు, సీరియల్స్ కు దూరమయింది.
బీజీపీలో చేరి మహిళా నాయకురాలిగా ఎదిగి ఎంపీ అయి కేంద్రమంత్రివర్గంలో పని చేసారు స్మృతి ఇరానీ. దాదాపు 10 ఏళ్ళ పాటు కేంద్రమంత్రిగా వివిధ శాఖలకు పనిచేసారు. 2009 నుంచే సీరియల్స్ తగ్గించేసినా 2013తో పూర్తిగా బుల్లితెరకు దూరమయింది స్మృతి ఇరానీ. ఇప్పుడు 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ బుల్లితెరపై కనిపించబోతుంది.
Also Read : Producer SKN Birthday : రాజాసాబ్ సెట్స్ లో నిర్మాత SKN పుట్టిన రోజు వేడుకలు.. ప్రభాస్ ఎక్కడ..?
ఒకప్పటి సూపర్ హిట్ బాలీవుడ్ సీరియల్ ‘క్యూన్కి సాస్ బి కభీ బహు తీ’ కి సీక్వెల్ రాబోతుంది. ఈ సీరియల్ లో గతంలో స్మృతి ఇరానీ మెయిన్ లీడ్ తులసి పాత్ర పోషించింది. ఇప్పుడు రాబోయే సీక్వెల్ లో మళ్ళీ అదే తులసి పాత్రతో బుల్లితెరపైకి రీ ఎంట్రీ ఇవ్వబోతుంది స్మృతి ఇరానీ.
ప్రస్తుతం ఈ సీరియల్ షూటింగ్ దశలో ఉన్నట్టు సమాచారం. ఈ సీరియల్ నుంచి తాజాగా స్మృతి ఇరానీ ఫస్ట్ లుక్ లీక్ అయింది. ఈ లుక్ లో పక్కా బాలీవుడ్ సీరియల్ పాత్ర లాగే కనిపించారు. అయితే గతంలో ఈ సీరియల్ తనమీదే నడిచింది కాబట్టి ఈ ఒక్క సీరియల్ మాత్రమే నటిస్తుందని సమాచారం. స్మృతి ఇటు సీరియల్ చేస్తూనే అటు రాజకీయాల్లో కూడా ఎప్పటిలాగే యాక్టివ్ గా ఉంటుందని తెలుస్తుంది.
Also Read : Pawan Kalyan : 20 ఏళ్లుగా ఒకే బ్రాండ్ డ్రెస్సులు మెయింటైన్ చేస్తున్న పవన్.. వాటి కాస్ట్ ఎంతో తెలుసా?