Amardeep Supritha new film update
బిగ్‌బాస్ ఫేమ్ అమర్ దీప్ చౌదరి ఓ చిత్రంలో నటిస్తున్నారు. నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ మూవీలో కథానాయిక. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.
కాగా.. ఈ సినిమాకు ఇంకా టైటిల్‌ను ఫిక్స్ చేయలేదు. ఈ చిత్రానికి టైటిల్ పెట్టే బాధ్యతను ప్రేక్షకులకు వదిలివేశారు. తమ సినిమాకి సూట్ అయ్యే టైటిల్‌ను చెప్పాలని చిత్ర బృందం కోరింది.
Allu Arjun : అక్కడ పుష్ప 2 సక్సెస్ మీట్ వేళ.. తల్లితో కలిసి అల్లు అర్జున్ ఎమోషననల్ మూమెంట్..
‘సినిమా మాది – టైటిల్ మీది’ అంటూ ఓ వీడియోను విడుదల చేసింది. ఆడియన్స్ తాము అనుకున్న టైటిల్‌ను +91 8985713959 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపాలని కోరారు.
ఎవరి టైటిల్ అయితే సెలక్ట్ అవుతుందో.. చిత్రబృందం వారి ఇంటి వద్దకు వెళ్లి వారితోనే టైటిల్ రివీల్ చేయించనున్నట్లు తెలిపింది.