Amazon Prime Video : ఇకపై సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా యాడ్స్.. యూజర్లకు షాక్ ఇచ్చిన అమెజాన్..

ఓటీటీలలో ఇవన్నీ చూడాలంటే డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కొన్ని ఫ్రీగా ఇచ్చినా వాటి మధ్య ఎక్కువగా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ వద్దంటే డబ్బులు పెట్టాల్సిందే.

Amazon Prime Video new rules pay extra for with out ad content

Amazon Prime Video :  ప్రస్తుతం ఓటీటీ(OTT)ల హవా సాగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని కొత్త సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. థియేటర్లలో రిలీజయిన సినిమాలు నెలలోపే ఓటీటీలలోకి వస్తున్నాయి. ఇక వారానికి ఒక కొత్త సిరీస్ వస్తుంది. ఇప్పటికే పలు ఓటీటీలు ఇండియాలో తమ మార్కెట్ ని పెంచుకోవడానికి మరింత ట్రై చేస్తూ కొత్త కొత్త షోలు, సిరీస్ లు తీసుకొస్తున్నాయి.

అయితే ఓటీటీలలో ఇవన్నీ చూడాలంటే డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సిందే. కొన్ని ఫ్రీగా ఇచ్చినా వాటి మధ్య ఎక్కువగా యాడ్స్ వస్తూ ఉంటాయి. ఆ యాడ్స్ వద్దంటే డబ్బులు పెట్టాల్సిందే. ఇప్పటివరకు టాప్ ఓటీటీలు అమెజాన్, నెట్ ఫ్లిక్స్, హాట్ స్టార్ లాంటి వాటిల్లో సబ్ స్క్రిప్షన్ తీసుకుంటే చాలు దానికి తగ్గట్టు వీడియోలు చూసుకోవచ్చు. అయితే అమెజాన్ ఇప్పుడు మరో కొత్త ప్రయోగం చేసి సబ్‌స్క్రైబర్స్ కి షాక్ ఇవ్వబోతుంది.

Also Read : Dhruva Natchathiram : ఎన్నాళ్ళో వేచిన సినిమా.. విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..

అమెజాన్‌లో డబ్బులు కట్టి సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నా ఇకపై గంట వీడియోకి నాలుగు నిమిషాల యాడ్ ప్లే చేస్తారట. అయితే ఇది వచ్చే సంవత్సరం 2024 మొదటి నుంచి అమలు అవుతుందని సమాచారం. సినిమాలు, సిరీస్ లు అన్నిటికి ఇది వర్తిస్తుందట. ఈ యాడ్స్ వద్దంటే సబ్‌స్క్రిప్షన్ కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు కట్టాలంట. అమెజాన్ తీసుకున్న ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బులు కట్టి వీడియోలు చూస్తుంటే యాడ్స్ పెట్టి ఇంకా ఎక్కువ డబ్బులు అడగడం కరెక్ట్ కాదని ఫైర్ అవుతున్నారు యూజర్లు. మరి అమెజాన్ ఈ నిర్ణయాన్ని అమలు చేస్తుందా లేదా చూడాలి. ఒకవేళ అమలు చేస్తే కచ్చితంగా అమెజాన్ కి సబ్‌స్క్రైబర్స్ తగ్గుతారు అనే భావిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు