Dhruva Natchathiram : ఎన్నాళ్ళో వేచిన సినిమా.. విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..

ఎట్టకేలకు ధ్రువ నక్షత్రం సినిమాకు ఆరేళ్ళ తర్వాత మోక్షం లభించింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు.

Dhruva Natchathiram : ఎన్నాళ్ళో వేచిన సినిమా.. విక్రమ్ ‘ధ్రువ నక్షత్రం’ వచ్చేస్తుంది.. రిలీజ్ డేట్ అనౌన్స్..

Gautham Vasudev menon Vikram Dhruva Natchathiram Movie Releasing date announced

Updated On : September 23, 2023 / 11:21 AM IST

Dhruva Natchathiram Release Date : తమిళ్ స్టార్ హీరో విక్రమ్(Vikram)ఈ ఏడాది పొన్నియిన్ సెల్వన్ 2 సినిమాతో ఆడియన్స్ ని పలకరించాడు. త్వరలో తంగలాన్ (Thangalaan) సినిమాతో రాబోతున్నాడు. కానీ దీనికంటే ముందు ఎప్పుడో ఆరేళ్ళ క్రితం ఆగిపోయిన సినిమాతో రాబోతున్నాడు. గౌతమ్ మీనన్(Gautham Vasudev Menon) దర్శకత్వంలో విక్రమ్ హీరోగా రీతువర్మ, ఐశ్వర్య రాజేష్, రాధికా, సిమ్రాన్, అర్జున్ దాస్.. లాంటి పలువురు స్టార్స్ తో స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ధ్రువ నక్షత్రం సినిమా 2017లోనే రిలీజ్ కావాల్సి ఉంది.

కానీ అనేక కారణాల వల్ల ధ్రువ నక్షత్రం మూవీ వాయిదా పడుతూ వస్తుంది. ఎట్టకేలకు ఈ సినిమాకు ఆరేళ్ళ తర్వాత మోక్షం లభించింది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్ తాజాగా సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. సినిమాలోని యాక్షన్ సీన్స్ తో ఓ ప్రోమోని రిలీజ్ చేసి ధ్రువ నక్షత్రం సినిమాని 24 నవంబర్ 2023న రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.

Also Read : Game Changer : కమల్ హాసన్ షూటింగ్ పూర్తి చేసిన శంకర్.. గేమ్ ఛేంజర్ అప్డేట్..

దీంతో విక్రమ్ అభిమానులు సంతోషిస్తున్నారు. స్పై యాక్షన్ సినిమా కావడం, గౌతమ్ మీనన్ దర్శకత్వంలో రాబోతుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.