Game Changer : కమల్ హాసన్ షూటింగ్ పూర్తి చేసిన శంకర్.. గేమ్ ఛేంజర్ అప్డేట్..

తమిళ మీడియా కథనాల ప్రకారం శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టనున్నారు.

Game Changer : కమల్ హాసన్ షూటింగ్ పూర్తి చేసిన శంకర్.. గేమ్ ఛేంజర్ అప్డేట్..

Ram Charan Shankar Movie Game Changer Update Here Director Shankar Completed Kamal Haasan Indian 2 Shooting

Game Changer Update : రామ్ చరణ్(Ram Charan) ఫ్యాన్స్ ఎంతగానో గేమ్ ఛేంజర్ సినిమా అప్డేట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. చరణ్ మాత్రం పాప పుట్టిందని కొన్ని నెలల పాటు సినిమాకు బ్రేక్ ఇచ్చాడు. డైరెక్టర్ శంకర్(Director Shankar) ఇదే సమయానికి అటు కమల్ హాసన్ తో ఇండియన్ 2 ప్రాజెక్టు కూడా పెట్టుకున్నాడు. కొన్ని రోజులు రెండు సినిమా షూటింగ్స్ మధ్య ట్రావెల్ చేసాడు శంకర్. చరణ్ బ్రేక్ ఇవ్వడంతో పూర్తిగా ఇండియన్ 2 సినిమా మీద దృష్టి పెట్టిన శంకర్ తాజాగా షూటింగ్ పూర్తి చేసినట్టు సమాచారం.

తమిళ మీడియా కథనాల ప్రకారం శంకర్ కమల్ హాసన్ ఇండియన్ 2 సినిమా షూటింగ్ పూర్తి చేసేశారు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ మొదలుపెట్టనున్నారు. అయితే రామ్ చరణ్ అభిమానులకు కూడా ఓ గుడ్ న్యూస్ వినపడుతుంది. వచ్చే వారం నుండి హైదరాబాద్ లో గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నట్టు సమాచారం.

Also Read : Manchu Lakshmi : నీకేంట్రా నొప్పి.. నువ్వేమన్నా డబ్బులిచ్చావా? నా సంపాదన నా ఇష్టం.. నెటిజన్స్ పై మంచు లక్ష్మి ఫైర్..

చరణ్ కూడా ఇందుకు ఓకే చెప్పినట్టు, శంకర్ కొన్ని రోజుల్లో హైదరాబాద్ కి రానున్నట్టు తెలుస్తుంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు. అయితే అధికారిక ప్రకటన మాత్రం రాలేదు. త్వరగా షూట్ మొదలుపెట్టి పూర్తి చేయాలని చరణ్ అభిమానులు కోరుకుంటున్నారు.