Ambajipeta Marriage Band actor Suhas said he is allu arjun fan
Suhas : టాలీవుడ్ యువ నటుడు సుహాస్ ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే, మరో పక్క పలు బడా సినిమాల్లో ముఖ్య పాత్రలు చేస్తూ వస్తున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతులో ఆరు సినిమాలు ఉన్నాయి. వీటిలో ‘అంబాజీపేట మ్యారేజి బ్యాండు’ సినిమా కూడా ఒకటి. ప్రస్తుతం ఈ మూవీని రిలీజ్ కి సిద్ధం చేస్తున్నాడు. అలాగే ప్రమోషన్స్ కూడా చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఇటీవల టీజర్ ని కూడా రిలీజ్ చేయగా.. ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో సుహాస్ అల్లు అర్జున్ అభిమానిగా కనిపించబోతున్నాడట.
టీజర్ లో ఒక సీన్ లో అల్లు అర్జున్ సూపర్ హిట్ మూవీ దేశముదురు వాల్ పోస్టర్ ముందుకు నుంచి బన్నీలా సుహాస్ స్టిల్ ఇస్తూ కనిపించాడు. ఈ విషయం గురించి సుహాస్ ని ప్రశ్నించగా.. “ఈ మూవీలో నేను బన్నీ అన్న అభిమానిగా కనిపిస్తాను. ఇక రియల్ లైఫ్ లో ఆయన ఆర్య సినిమా చూసిన దగ్గర నుంచి నాకు డాన్స్ మీద ఇంటరెస్ట్ కలిగింది. అప్పటి నుంచి డాన్స్ చేయడం మొదలు పెట్టాను. అసలు ఇండస్ట్రీకి కొరియోగ్రాఫర్ అవ్వాలని వచ్చాను. కానీ యాక్టర్ అయ్యాను” అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక అంబాజీపేట మ్యారేజి బ్యాండు మూవీ విషయానికి వస్తే.. రూరల్ యాక్షన్ డ్రామాతో ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. సుహాస్ గత రెండు సినిమాలు లవ్, ఫ్యామిలీ కథాంశంతో సాగాయి. అయితే ఈ చిత్రం మాత్రం.. ఆడపిల్లల పుట్టడం కష్టం, జాతిభేదం అనే అంశాలతో ఒక సోషల్ మెసేజ్ తో రాబోతున్నట్లు టీజర్ చూస్తుంటే అర్ధమవుతుంది. బన్నీ వాస్, దర్శకుడు వెంకటేష్ మహా సమర్పణలో ధీరజ్ నిర్మిస్తున్న ఈ సినిమాని దుశ్యంత్ డైరెక్ట్ చేస్తున్నాడు. శివాని హీరోయిన్ గా నటిస్తుంటే ఫిదా ఫేమ్ శరణ్య ఒక ప్రధాన పాత్ర చేస్తుంది.