Ambajipeta Marriage Band : ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీ టీమ్ ఆ ఊరి కోసం ఏం చేస్తోందంటే?

'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు' మూవీ టీమ్ తమ సినిమా సక్సెస్‌లో భాగమో? .. నిజంగానే కృతజ్ఞతలు చెప్పుకోవడలో భాగమో? ఇప్పటివరకు ఎవరూ చేయని పని చేస్తోంది.. అదేంటంటే?

Ambajipeta Marriage Band

Ambajipeta Marriage Band : రీసెంట్‌గా రిలీజైన ‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.  ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ఇప్పటివరకు ఎవరూ చేయని పనిచేస్తోంది.. అదేంటంటే?

Bigg Boss Utsavam: బిగ్ బాస్ సీజన్ 7 కంటెస్టెంట్స్ రీ యూనియన్ సెలబ్రేషన్స్ ఫొటోస్ వైరల్

‘అంబాజీపేట మ్యారేజీ బ్యాండు’ ఫిబ్రవరి 2న థియేటర్లలో రిలీజైంది మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతోంది. సుహాస్, శివాని జంటగా తెరకెక్కిన ఈ సినిమాను దుశ్యంత్ కటికినేని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నితిన్, శరణ్య, జగదీశ్ ముఖ్య పాత్రలు పోషించారు. మూవీ టీమ్ సినిమా సక్సెస్‌తో సంబరంలో ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకి మరింత హైప్ తెచ్చేందుకు నిర్మాత థీరజ్ మొగిలినేని ఇప్పటివరకు ఏ మూవీ టీమ్ తీసుకోని సరికొత్త నిర్ణయం తీసుకున్నారట.

ఈ మూవీలో స్ట్రీట్ సెట్, బ్యాండ్-ఆఫీస్ సెట్, సెలూన్ షాప్ సెట్ సహా సినిమాలో ఎక్కువ భాగం అంతా అమలాపురం సమీపంలో ఉన్న లూటుకుర్రు గ్రామంలో షూట్ చేశారట. సినిమాలో మిగిలిన సీన్స్ అన్నీ అంబాజీపేటలో తీసారట. అయితే లూటుకుర్రు గ్రామ ప్రజలు షూటింగ్ టైమ్‌లో పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చారని అందుకే ఆ గ్రామంలో అందరికీ ఈ వారంలో వేడుకగా భోజనాలు పెట్టాలని నిర్మాత ధీరజ్ నిర్ణయించుకున్నారట.

Rajeev Kanakala : సుమకి షోలు తగ్గిపోవడానికి కారణం చెప్పిన రాజీవ్ కనకాల

లూటుకుర్రు గ్రామంలో జరగబోతున్న భోజనాల వేడుకలో అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాలోని నటీనటులు, సిబ్బంది అందరూ పాల్గొంటారట. ఏదైనా సినిమా షూటింగ్ అయిపోతే చాలు పేకప్ చెప్పేసి అక్కడి నుంచి చెక్కేసే సినిమా యూనిట్ గురించి తెలుసు కానీ.. మళ్లీ ఆ గ్రామానికి వెళ్లి గ్రాస్తులకు భోజనం పెడుతున్న సినిమా టీమ్ ఇదేనేమో అని అందరూ మాట్లాడుకుంటున్నారట. టీమ్‌ను అభినందిస్తున్నారట.

ట్రెండింగ్ వార్తలు