Rajeev Kanakala : సుమకి షోలు తగ్గిపోవడానికి కారణం చెప్పిన రాజీవ్ కనకాల

యాంకర్ సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్ లో కనిపించడం లేదు. ప్రోగ్రామ్స్ తగ్గించుకున్నారా? ఆఫర్స్ లేవా? రాజీవ్ కనకాల అసలు విషయం చెప్పారు.

Rajeev Kanakala : సుమకి షోలు తగ్గిపోవడానికి కారణం చెప్పిన రాజీవ్ కనకాల

Rajeev Kanakala

Rajeev Kanakala : రాజీవ్ కనకాల-సుమ కనకాల ఇద్దరు బుల్లితెరపై ఎంతో పేరు తెచ్చుకున్న జంట. ప్రస్తుతం రాజీవ్ సినిమాలతో బిజీగా ఉంటే సుమ టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు సినిమా ఈవెంట్స్‌కి హోస్ట్ చేస్తూ బిజీగా ఉన్నారు. అయితే ఈ మధ్య సుమ పెద్దగా టీవీ ప్రోగ్రామ్స్‌లో కనిపించట్లేదు. అందుకు కారణమేంటో రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

Vijay : దళపతి విజయ్ చివరి సినిమా అదేనా? తెలుగు నిర్మాత – తమిళ్ డైరెక్టర్?

రాజీవ్-సుమ జంట ఇద్దరు తమ కెరియర్లో బిజీగానే ఉన్నారు. రాజీవ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వరుస సినిమాలు చేస్తున్నారు. ఇక సుమ టీవీ ప్రోగ్రామ్స్‌తో పాటు సినిమా ఈవెంట్స్ ఏవి జరిగినా అక్కడ ఖచ్చితంగా ఉంటారు. అయితే సుమ ఈ మధ్య టీవీ ప్రోగ్రామ్స్ బాగా తగ్గించేశారు. ‘సుమ అడ్డా’ తప్ప వేరేం ప్రోగ్రామ్స్‌లో కనిపించడం లేదు. అవకాశాలు తగ్గిపోయాయా? లేక కావాలనే తగ్గించుకున్నారా? అనే డౌట్ జనాల్లో ఉంది. ఇదే విషయంపై రాజీవ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో సైతం తాము ప్రోగ్రామ్స్ ఎలా చేసేవారో గుర్తు చేసుకున్నారు.

Premam : మూడోసారి రీ రిలీజ్ అయినా కోట్లు కొల్లగొడుతున్న ఆ సినిమా

సుమ ప్రోగ్రామ్స్ కావాలనే తగ్గించుకున్నారట. సుమ అడ్డా ప్రోగ్రామ్‌తో పాటు సినిమా రిలీజ్ ఈవెంట్స్ చేస్తున్నారట. అందుకు కారణం తన సొంత ఛానెల్ ‘సుమ’ కోసం ప్రత్యేక కార్యక్రమాలు చేయడంలో బిజీగా ఉన్నారట. ఈ విషయాన్ని రాజీవ్ చెప్పారు. వరుస ప్రోగ్రామ్స్ చేస్తూ బిజీగా ఉన్న సమయంలో కూడా సుమ ఇల్లు, పిల్లల విషయంలో అశ్రద్ధ చూపించలేదని ఎట్టి పరిస్థితుల్లో సాయంత్రానికి ఇంటికి వచ్చి టైమ్ కేటాయించే వారని రాజీవ్ చెప్పారు. సుమ తండ్రి చనిపోయి బాధలో ఉన్న సందర్భంలో కూడా తాము ప్రొడ్యూస్ చేసిన ‘లక్కు కిక్కు’ ప్రోగ్రామ్‌కి సుమ ఎపిసోడ్ చేసారని గుర్తు చేసుకున్నారు రాజీవ్. ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కూడా ఆర్టిస్టుల జీవితాలు ఇలాగే ఉంటాయని అన్నారు. మొత్తానికి సుమ బయట ప్రోగ్రామ్స్ కాస్త తగ్గించుకుని సొంత ఛానెల్ కోసం కష్టపడుతున్నారన్న మాట.