ram charan's first baby
Ram Charan : టాలీవుడ్ హీరో రామ్ చరణ్.. మార్చి 13న జరిగే ఆస్కార్ అవార్డు వేడుకల్లో పాల్గొనేందుకు ఇటీవల అమెరికా వెళ్లిన సంగతి అందరికి తెలిసిందే. అయితే అక్కడ అరుదైన గౌరవం దక్కించుకున్నాడు మన మెగాపవర్ స్టార్. అమెరికాలో అత్యధికలు వీక్షించే పాపులర్ షోలలో ఒకటైన షో.. ‘గుడ్ మార్నింగ్ అమెరికా’. ఈ టాక్ షోకు రామ్ చరణ్ గెస్ట్ గా ఆహ్వానం అందుకున్నాడు. ఇండియన్ నుంచి ఈ షోకి అతిధిగా వెళుతున్న మొదట ఇండియన్ సెలెబ్రెటీ రామ్ చరణ్. ఇక ఈ షోలో పాల్గొన్న చరణ్.. RRR మరియు తన పర్సనల్ విషయాలను చర్చించాడు.
Ram Charan : చరణ్ బర్త్ డేకి అభిమానులకు బహుమతి.. ఏంటది?
ఈ క్రమంలోనే రామ్ చరణ్ తండ్రి కాబోతునందుకు శుభాకాంక్షలు తెలియజేసిన యాంకర్, తండ్రి కాబోతున్న ఫీలింగ్ ఎలా ఉంది అంటూ చరణ్ ని ప్రశ్నించింది. దీనికి రామ్ చరణ్ బదులిస్తూ.. ‘ఈ సమయంలో నా భార్య ఉపాసనతో ఉండాలని అనుకుంటున్న కానీ నేను సినిమాలు, షూటింగ్స్ వల్ల ఒక చోట నుంచి మరో చోటకి ప్రయాణిస్తూనే ఉంటున్నా. డెలివరీ టైంలో తనని నాతో ట్రావెల్ చేయించలేను. నా లక్ ఇవాళ మిమ్మల్ని కలిశాను. నా భార్యని కూడా అమెరికాకు తీసుకు వస్తాను, ఆమెను మీరే చూసుకోవాలి’ అని యాంకర్ తో అన్నాడు.
కచ్చితంగా, మీ ఫస్ట్ బేబీని డెలివరీ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా అంటూ చరణ్ తో చెప్పగా, రామ్ చరణ్ థాంక్యూ చెబుతూ.. ఆమె అమెరికాలోనే ఫేమస్ డాక్టర్ అని ఇండియన్ అభిమానులకు తెలియజేశాడు. ఈ వీడియోని గుడ్ మార్నింగ్ అమెరికా షో వాళ్ళు పోస్ట్ చేయగా, ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఇక ఇది ఇలా ఉంటే.. ప్రముఖ హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (HCA) అవార్డ్స్ కి రామ్ చరణ్ ని ప్రజెంటర్ గా ఆహ్వానించారు. ఈ అవార్డ్స్ లో విజేతగా నిలిచిన హాలీవుడ్ ప్రముఖులు రామ్ చరణ్ చేతులు మీదగా అవార్డు అందుకోనున్నారు. ఈ ఘనత అందుకున్న తొలి ఇండియన్ హీరో కూడా రామ్ చరణ్ కావడం గమనార్హం.
“RRR” star Ram Charan (@AlwaysRamCharan) dishes on “Naatu, Naatu” becoming the first song from an Indian film production to be Oscar-nominated for best original song. #GMA3 pic.twitter.com/tpfIPFqcDu
— GMA3: What You Need To Know (@ABCGMA3) February 22, 2023