సైరా కోసం వాళ్లిద్దరు ఫ్రీగా చేశారట

  • Publish Date - October 3, 2019 / 04:07 PM IST

సైరా నరసింహా రెడ్డి సినిమాలో అమితాబ్ బ‌చ్చ‌న్ ఒక కీలకమైన పాత్రలో చేశారు. అలాగే అనుష్క కూడా ఒక ప్రత్యేకమైన పాత్రలో ఝాన్సీ లక్ష్మీబాయ్‌గా చేశారు. సైరా సినిమాని ఆ పాత్ర‌తోనే ప్రారంభిస్తారు. ఆ పాత్ర‌తోనే ముగిస్తారు. సైరా టీమ్ లో భాగ‌మైన ఈ ఇద్ద‌రూ ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోకుండా న‌టించారట.

ఈ విష‌యాన్ని మెగాస్టార్ చిరంజీవి వెల్ల‌డించారు. అమితాబ్‌ని న‌టించ‌మ‌ని ఒక్క ఫోన్ కాల్ చేసి అడ‌గ్గానే ఒప్పుకున్నార‌ని, సొంత విమానంలో షూటింగ్‌కి వ‌చ్చార‌ని, హోటల్ డ‌బ్బులు కూడా ఆయ‌నే క‌ట్టుకున్నార‌ు చెప్పారు చిరు.

ఇప్పుడు `సైరా` థ్యాంక్స్ మీట్‌లో ఆ విష‌యాన్నే గుర్తు చేసుకున్నారు. పారితోషికం గురించి ప్ర‌స్తావించినా `ఇది నా స్నేహితుడి కోసం చేస్తున్న సినిమా.. మీకు భారం అవ్వ‌కూడ‌దు. ఆ తృప్తి నాకు మిగ‌ల్చండి` అంటూ సున్నితంగా తిర‌స్క‌రించారని చెప్పారు.

అంతేకాదు అనుష్క కూడా రూపాయి కూడా తీసుకోకుండా న‌టించింద‌ని, వాళ్లిద్ద‌రికీ కృత‌జ్ఞ‌త‌లు అని తెలియ‌జేశారు చిరు. అనుష్క అమెరికా నుంచి వచ్చి చేసేసి వెళ్లిపోయారు. డబ్బులు ఇవ్వొద్దంటూ తన అభిమానాన్ని చూపారని చెప్పారు. అమితాబ్ బచ్చన్ గారు, అనుష్కకు ఈ విషయంలో ధన్యవాదాలు అని అన్నారు.