Amitabh – Kamal : కమల్‌తో ప్రాజెక్ట్ K లో కలిసి పనిచేయడం పై అమితాబ్ ట్వీట్.. అంతకుముందు వీరిద్దరూ చేసిన సినిమా తెలుసా?
కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ కలిసి ప్రాజెక్ట్ K సినిమాలో నటించబోతున్న సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరూ కలిసి అంతకుముందు చేసిన సినిమా ఏంటో తెలుసా?
- gum 95921
- Published on- June 25, 2023 / 02:46 PM IST
Amitabh Bachchan and Kamal Haasan acted movie list before project k
Amitabh Bachchan – Kamal Haasan : ప్రభాస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ ప్రాజెక్ట్ K (Project K). సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్నాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ సినిమాని 500 కోట్ల బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు. ఇక చిత్రంలో భారీ స్టార్ కాస్ట్ కూడా కనిపిస్తుంది. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దిశా పఠాని వంటి బాలీవుడ్ స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్ట్ లోకి లోకనాయకుడు కమల్ హాసన్ కూడా ఎంట్రీ ఇచ్చాడు.
ఈ విషయాన్ని చిత్ర యూనిట్ నేడు (జూన్ 25) అధికారికంగా ప్రకటించింది. ఇక కమల్ ఎంట్రీ గురించి ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్ వేయగా.. అమితాబ్ కూడా కమల్ కి వెల్కమ్ పలుకుతూ ట్వీట్ చేశారు. “వెల్కమ్ కమల్. నీతో మళ్ళీ కలిసి పని చేయబోతుండడం చాలా ఆనందంగా ఉంది. దీని కోసం ఎప్పుడు నుంచో ఎదురు చూస్తున్నా” అంటూ ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చూసిన కొంతమంది ప్రేక్షకులు.. వీరిద్దరూ కలిసి గతంలో ఎప్పుడు పని చేసి ఉంటారు అని సెర్చ్ చేస్తున్నారు. అమితాబ్ అండ్ కమల్ కలిసి రెండు సినిమాల్లో నటించారు.
Bandla Ganesh : మళ్ళీ కాంగ్రెస్‌లోకే బండ్ల గణేష్.. భట్టి విక్రమార్క పాదయాత్రలో బండ్లన్న..
అయితే అందులో ఒక సినిమా రిలీజ్ కాలేదు. వీరిద్దరూ కలిసి 1984 లో ‘ఖబడ్ధార్’ అనే సినిమాలో నటించారు. కానీ ఆ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ఇక ఆ తరువాత 1985 లో ‘గెరాఫ్తార్’ సినిమాలో నటించారు. ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ కూడా నటించాడు. గెరాఫ్తార్ తరువాత కమల్ అండ్ అమితాబ్ దాదాపు 48 ఏళ్ళ తరువాత మళ్ళీ ఇప్పుడు కలిసి ప్రాజెక్ట్ K లో పని చేస్తున్నారు.
