Prabhas : నా డ్రీమ్ నెరవేరబోతోంది.. ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్‌తో నటించడంపై ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు.

Prabhas : నా డ్రీమ్ నెరవేరబోతోంది.. ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్‌తో నటించడంపై  ప్రభాస్ ఎమోషనల్ పోస్ట్..

Prabhas emotional post on Kamal Hassan for acting in Project K Movie

Updated On : June 25, 2023 / 12:35 PM IST

Project K : రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా నాగ్ అశ్విన్(Nag Ahwin) దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ పై దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ప్రస్తుతం ప్రాజెక్ట్ K సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సినిమాలో దీపికా పదుకొనే, అమితాబ్, దిశా పఠాని.. ఇలా బాలీవుడ్ స్టార్స్, మరింతమంది స్టార్ యాక్టర్స్ నటిస్తున్నారు.

తాజాగా ప్రాజెక్ట్ K సినిమా నుంచి వచ్చిన అప్డేట్ అందర్నీ ఆశ్చర్యపరుస్తుంది. లోకనాయకుడు కమల్ హాసన్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నట్టు చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించారు. భూమి మొత్తాన్ని కవర్ చేసే ఓ నీడ కావాలి మాకు, అది కమల్ హాసన్ అంటూ ప్రాజెక్ట్ K సినిమాలో కమల్ పాత్రని తెలిపేలా ఓ చిన్న గ్లింప్స్ రిలీజ్ చేసింది వైజయంతి మూవీస్. దీంతో ప్రాజెక్ట్ Kలో కమల్ హాసన్ కూడా నటిస్తున్నారని అధికారికంగా క్లారిటీ వచ్చేసింది. కమల్ ఈ సినిమాలో విలన్ రోల్ చేయనున్నట్టు సమాచారం. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

Kamal Haasan : ‘ప్రాజెక్ట్ K’లో కమల్ హాసన్.. అధికారిక ప్రకటనతో అదిరిపోయే అప్డేట్..

ప్రాజెక్ట్ K సినిమాలో కమల్ నటిస్తుండటంపై ప్రభాస్ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. చిత్రయూనిట్ రిలీజ్ చేసిన వీడియోని షేర్ చేసి.. నా హృదయంలో ఎప్పటికి గుర్తుండిపోయే జ్ఞాపకం, కమల్ సర్ తో కలిసి నటించడం గౌరవం కంటే ఎక్కువ. ఆయన దగ్గర నటిస్తూ నేర్చుకోవడం గొప్ప అదృష్టం, నా డ్రీం నెరవేరబోతోంది అంటూ ఎమోషనల్ గా పోస్ట్ చేశారు. దీంతో ప్రభాస్ పోస్ట్ కూడా వైరల్ గా మారింది. ఇక ఈ సినిమాని సంక్రాంతి కానుకగా 12 జనవరి 2024 లో రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

View this post on Instagram

A post shared by Prabhas (@actorprabhas)