Amitabh Bachchan asks about Pawan Kalyan Kaun Banega Crorepati Video goes Viral
Pawan Kalyan – Amitabh Bachchan : పవన్ కళ్యాణ్ కి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ తెలిసిందే. కానీ ఇటీవల ఏపీలో జరిగిన ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో గెలవడం, పవన్ కళ్యాణ్ ని నరేంద్రమోడీ జాతీయ వేదికలపై పొగడటం, పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అవ్వడంతో నేషనల్ వైడ్ పవన్ కి మంచి క్రేజ్ వచ్చింది. వేరే రాష్ట్రాల్లో, నేషనల్ మీడియాలో కూడా పవన్ సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో వచ్చే కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రశ్న అడిగారు. అమితాబ్ బచ్చన్ హోస్ట్ గా హిందీలో కౌన్ బనేగా కరోడ్‌పతి ప్రోగ్రాం ఎన్నో ఏళ్లుగా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో తాజా ఎపిసోడ్ లో కంటెస్టెంట్స్ ని అమితాబ్ పవన్ గురించి ప్రశ్న అడిగారు. 2024లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకున్న నటుడు ఎవరు అనే ప్రశ్న అమితాబ్ అడిగారు. దీనికి కంటెస్టెంట్స్ ఆడియన్స్ పోల్ తీసుకోగా పవన్ కళ్యాణ్ అని చెప్పారు. దీంతో లక్ష అరవై వేల రూపాయలు ఈ ప్రశ్నకు గెలుచుకున్నారు.
Also Read : Nani : మరోసారి అయ్యప్ప మాలలో నాని.. దుబాయ్‌లో సందడి..
అనంతరం అమితాబ్ మాట్లాడుతూ.. జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. చాలా మంచి నటుడు. చిరంజీవి గారి చిన్న తమ్ముడు అంటూ తెలిపారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. పవన్ ఫ్యాన్స్ ఈ వీడియోని షేర్ చేస్తూ బాలీవుడ్ ప్రోగ్రామ్స్ లో కూడా పవన్ గురించి అడిగేలా సక్సెస్ కొట్టారు అని అంటున్నారు.
అమితాబ్ బచ్చన్ గారి "కౌన్ బనేగా కరోడ్‌పతి" ప్రోగ్రాం క్విజ్ ప్రశ్న :- జూన్ 2024లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సిఎంగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు?
And you know the answer :- @PawanKalyan 💥💥 pic.twitter.com/vmWvF76a5c
— Pawan Kalyan Crew (@PSPKCrew) September 13, 2024