Nani : మరోసారి అయ్యప్ప మాలలో నాని.. దుబాయ్‌లో సందడి..
హీరో నాని తాజాగా అయ్యప్ప మాలలో కనిపించారు.

Natural Star Nani wears Ayyappa Deeksha and went to Dubai Photos goes Viral
Nani : మన సెలబ్రిటీలు చాలా మంది రెగ్యులర్ గా అయ్యప్ప మాల వేసుకుంటారని తెలిసిందే. చిరంజీవి లాంటి స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు చాలా మంది కుదిరిన ప్రతిసారి అయ్యప్ప మాల వేసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ అయ్యప్ప మాలలు వేసే సమయం రావడంతో ఇప్పుడిప్పుడే భక్తులు అయ్యప్ప మాల వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో హీరో నాని తాజాగా అయ్యప్ప మాలలో కనిపించారు.
న్యాచురల్ స్టార్ నాని గతంలో కూడా పలు మార్లు అయ్యప్ప మాల వేసుకున్నారు. గత సంవత్సరం మాల వేసుకొని పూజలు చేసి, శబరిమల వెళ్లిన వీడియోలను తన సోషల్ మీడియాలో షేర్ చేసారు. తాజాగా నిన్న దుబాయ్ లో సైమా అవార్డుల వేడుక జరగ్గా ఈ ఈవెంట్ కి నాని అయ్యప్ప మాలలో హాజరయ్యారు. దుబాయ్ కి నాని ఇలా అయ్యప్ప మాలలో హాజరవ్వడం గమనార్హం. దీనిపై ఫ్యాన్స్, నెటిజన్స్ అభినందిస్తున్నారు. గతంలో రామ్ చరణ్ కూడా అయ్యప్ప మాలలో అమెరికాకు వెళ్లారు. ప్రస్తుతం నాని అయ్యప్ప మాలలో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.