Aaradhya Bachchan : మొన్న తాత, ఇవాళ మనవరాలు.. కోర్ట్‌ని ఆశ్రయించిన అమితాబ్ గారాలపట్టి!

ఇటీవల బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ కోర్ట్ ని ఆశ్రయించగా, తాజాగా ఆయన మనవరాలు ఆరాధ్య బచ్చన్ కోర్ట్ ని ఆశ్రయించింది. విషయం ఏంటంటే..

Amitabh Bachchan grand daugther Aaradhya approached delhi high court

Aaradhya Bachchan : బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) గారాలపట్టి, అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) కూతురు ఆరాధ్య బచ్చన్ ఇటీవల ఢిల్లీ హైకోర్ట్ ని ఆశ్రయించింది. తన ఆరోగ్యం గురించి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయి. దీంతో ఆరాధ్య తన తండ్రి అభిషేక్ బచ్చన్ ద్వారా కోర్ట్ ని ఆశ్రయించింది. ఎలాంటి ఆధారాలు లేకుండా తన ఆరోగ్యం పై కల్పిత వార్తలు రాసి, వీడియోలు చేసే వారి పై చర్యలు తీసుకోవాలంటూ కోర్ట్ లో పిర్యాదు చేసింది.

Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఏకైక తెలుగు సినిమా.. ఏంటో తెలుసా?

ఈ పిర్యాదుని విచారించిన ఢిల్లీ హైకోర్ట్ ఘాటుగా స్పందించింది. సెలెబ్రిటీ పిల్లలు అయినా, సామాన్యుడి పిల్లలు అయినా గౌరవంగా చూసుకోవాలి. వారి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా తప్పుడు వార్తలను వ్యాప్తి చేయడం చట్టం ముందు నేరమే. ఆరాధ్య తన పిటిషన్ లో పేర్కొన్న పలు వీడియోలను వెంటనే తొలగించాలని కోర్ట్ సైబర్ పోలీసులను ఆదేశించింది. ఆరాధ్య ఆరోగ్యంపై తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న 9 యూట్యూబ్ ఛానెల్‌లను హైకోర్టు నిషేధించింది. కాగా అమితాబ్ బచ్చన్ కూడా ఇటీవల కోర్ట్ ని ఆశ్రయించాడు.

RRR : అమిత్ షాతో RRR టీం భేటీ.. ఆస్కార్ గెలుపు పై చర్చ..

తన ఫోటో మరియు పేరుని ఉపయోగించుకొని పలువురు వ్యాపారాలు, ఆన్ లైన్ సైట్ లు రన్ చేస్తున్నారు. వాటి పై వెంటనే చర్యలు తీసుకోవాలని అమితాబ్ కోర్ట్ ని ఆశ్రయించగా.. అమితాబ్ పేరు పై సర్వ హక్కులు ఆయనకే ఉన్నాయి. ఆయన అనుమతి లేకుండా ఎవరు ఆయన పేరు మరియు ఫోటోని ఉపయోగించుకోకూడదని ఆదేశించింది. కాగా అమితాబ్ ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రభాస్ ప్రాజెక్ట్ K సినిమాలో నటిస్తున్నాడు. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ మూవీ పై పాన్ ఇండియా వైడ్ భారీ హైప్ నెలకుంది.