Kamal – Amitabh : హాలీవుడ్ స్టేజి పై కమల్ హాసన్‌కి అమితాబ్ కౌంటర్.. వీడియో వైరల్!

ప్రభాస్ అండ్ కమల్ తో పాటు అమితాబ్ వీడియో కాల్ ద్వారా కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇక ఈ కార్యక్రమంలో కమల్ మాటలకి అమితాబ్ కౌంటర్ ఇవ్వగా అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

Pic Source from google

Kamal Haasan – Amitabh Bachchan : ప్రభాస్ (Prabhas), కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ మూవీ టైటిల్ గ్లింప్స్ ని అమెరికా కాలిఫోర్నియాలోని San Diegoలో నిర్వహించే ప్రతిష్టాత్మక ఈవెంట్ కామిక్ కాన్ లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు. కల్కి (Kalki 2898 AD) అని టైటిల్ ని ఈ మూవీకి ఖరారు చేశారు. టైటిల్ గ్లింప్స్ లాంచ్ అనంతరం మూవీ టీం అంతా అక్కడి ఆడియన్స్ అండ్ మీడియాతో ఇంటరాక్ట్ అయ్యింది. ఈ ఇంటరాక్షన్ కి అమితాబ్ బచ్చన్ వీడియో కాల్ ద్వారా హాజరయ్యాడు.

Kamal Haasan : అమితాబ్ బచ్చన్ నటించిన ఆ సినిమా అండ్ నిర్మాతల పై నాకెంతో ద్వేషం కలిగింది..

ఇక ఈ కార్యక్రమంలో కమల్ హాసన్ మాట్లాడుతూ.. “మన ప్రేక్షకులు మన సినిమాలని ఆదరిస్తూ నేడు ఇక్కడి వరకు తీసుకు వచ్చారు. వారి అభిమానంతో అమితాబ్ బచ్చన్, ప్రభాస్, రానా దగ్గుబాటి వంటి సూపర్ స్టార్స్ ని తయారు చేశారు” అంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలకు అమితాబ్ రియాక్ట్ అవుతూ.. ”మరి అంత నిరాడంబరంగా ఉండడం మానేయండి కమల్‌. మా అందరికంటే మీరు చాలా గొప్పవారు” అంటూ కౌంటర్ ఇచ్చాడు. ఆ కౌంటర్ తో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు.

Prabhas : కామిక్ కాన్ ఈవెంట్‌లో ప్రభాస్ స్పెషల్ AV చూశారా.. అదిరిపోయింది.. గూస్‌బంప్స్ అంతే..

అమితాబ్ తన మాటల్ని కొనసాగిస్తూ.. “కమల్ నటించిన సినిమాలు చేయడం చాలా కష్టం. ఆయన ప్రతి సినిమాలో చాలా వాస్తవికత ఉంటుంది. ప్రతి పాత్ర కోసం ఎంతో కష్టపడతారు. కమల్ తో ఇంతకుముందు ఒక సినిమా చేశాను. కానీ ఈ మూవీ మాత్రం ప్రత్యేకం” అంటూ చెప్పుకొచ్చారు. ఇక ఈ మాటలకు కమల్ రియాక్ట్ అవుతూ.. అమితాబ్ ఎన్నో గొప్ప సినిమాలు చేశారు, అలాంటి యాక్టర్ తన సినిమాల గురించి గొప్పగా మాట్లాడడం తనకి ఎంతో సంతోషాన్ని కలగజేసినట్లు కమల్ పేర్కొన్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.