Amitabh Bachchan
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ అంటే బాలీవుడ్ మెగాస్టార్ అనే సంగతి తెలిసిందే. అమితాబ్ రెమ్యునరేషన్ కూడా భారీగానే ఉంటుంది. నాలుగు దశాబ్దాలపైనే ఇండస్ట్రీలో ఉన్న ఈ పెద్దాయన సంపాదన కూడా వేలకోట్లలోనే ఉంటుందని అంచనా. ఇక ఆయన కుమారుడు అభిషేక్ బచ్చన్, కోడలు ఐశ్వర్య రాయ్ సంపాదన కూడా ఎక్కువే ఉంటుంది. సినిమాలతో పాటు ప్రకటనతో కూడా భారీగానే వెనకేసే ఈ కుటుంబం ఆస్తుల అద్దె రూపంలో కూడా భారీగానే ఆర్జిస్తుందట.
Poonam Kaur: ‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలనం!
బచ్చన్ కుటుంబానికి ముంబైలోని జుహులో వత్స, అమ్ము అనే రెండు బంగ్లాలున్నాయి. ఇది పూర్తిగా వాణిజ్య ప్రాంతం కాగా.. ఇక్కడ బిజినెస్ టైకూన్లు, ప్రముఖులు నివాసం ఉంటున్నారు. అందుకే ఈ బంగ్లాలకు డిమాండ్ కూడా ఎక్కువగానే ఉంటుంది. ఈ రెండు బంగ్లాలలోని ఒక్క గ్రౌండ్ ఫ్లోర్ ను నెలకు రూ.18.9 లక్షల అద్దెతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు 15 సంవత్సరాలుకు లీజుకు ఇచ్చినట్లు ఓ రియల్ ఎస్టేట్ వెబ్ సైట్ పేర్కొంది. ఈ లీజు ఒప్పందాన్ని సెప్టెంబర్ 28, 2021న చేసుకోగా.. ప్రతి ఐదు సంవత్సరాలకు 25 శాతం అద్దె పెంచుకునే నిబంధన కూడా చేసుకున్నట్లు పేర్కొన్నారు.
Regina Cassandra: డస్కీ బ్యూటీ.. ఆస్వాదనకు రెండు కళ్ళూ చాలవేమో!
అమితాబ్ బ్యాంకు లీజులో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఇప్పుడు నెలకు రూ.18.9 లక్షల అద్దె కాగా.. ఐదేళ్ల తర్వాత అద్దె రూ.23.6 లక్షలు, పదేళ్ల తర్వాత రూ.29.5 లక్షలుగా అద్దె ఉంటుందని, ఇప్పటికే 12 నెలల అద్దెకు సమానమైన రూ.2.26 కోట్ల డిపాజిట్ బ్యాంకు చెల్లించినట్లు డాక్యుమెంట్లలో పేర్కొన్నట్లు ఆ వెబ్ సైట్ తెలిపింది. ఈ బంగ్లాలు ప్రస్తుతం బచ్చన్ కుటుంబం నివసిస్తున్న బంగ్లా పక్కనే ఉండగా ఈ ఆస్తి 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో రూ. వంద నుండి రూ.200 కోట్లకు పైనే ఒక్కో బంగ్లా విలువ చేసేదిగా ముంబై రియల్ ఎస్టేట్ వ్యాపారాలు పేర్కొన్నారు.