Poonam Kaur: ‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలనం!

పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలనంగా మారింది. ఆమె ట్రెడిషనల్ లుక్ లో కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన పూనమ్ పీకే లవ్ అంటూ ట్యాగ్ చేసింది. దీంతో..

Poonam Kaur: ‘పీకే లవ్’ అంటూ మరోసారి పూనమ్ సంచలనం!

Poonam Kaur

Updated On : October 8, 2021 / 6:25 PM IST

Poonam Kaur: పీకే లవ్ అనే హ్యాష్ ట్యాగ్ తో నటి పూనమ్ కౌర్ మరోసారి సంచలనంగా మారింది. ఆమె ట్రెడిషనల్ లుక్ లో కొన్ని ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసిన పూనమ్ పీకే లవ్ అంటూ ట్యాగ్ చేసింది. దీంతో దీని అర్ధం ఏమై ఉంటుందో అని మళ్ళీ సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. నిజానికి పీకే అంటే పూనమ్ కౌర్ అనే అర్ధం కూడా వస్తుంది. కానీ నెటిజన్లు మాత్ర్రం అదొక్కటే కాదు అని మరేదో అయివుంటుందని అర్ధాలు తీస్తున్నారు.

Regina Cassandra: డస్కీ బ్యూటీ.. ఆస్వాదనకు రెండు కళ్ళూ చాలవేమో!

నిజానికి చాలాకాలంగా ప్రేమ విషయంలో పూనమ్ కౌర్ కు అన్యాయం జరిగిందని సోషల్ మీడియాలో డిస్కస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే పూనమ్ చిత్ర పరిశ్రమలో నా ఏకైక గురువు దాసరి నారాయణ రావు. ఆయనను చాలా మిస్సవుతున్నారు. దాసరి గారికి నేనొక సందేశాన్ని తెలియజేయాలనుకుంటున్నా. దేవుడు దీనిని ఆయనకు చేరవేస్తాడని ఆశిస్తున్నాను’ అంటూ రాసుకొచ్చిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారగా.. ఎప్పటికప్పుడు ఆమె చేసే ట్వీట్ అలెర్ట్ అయ్యేలా చేస్తున్నాయి.

Telugu Films: దండయాత్ర.. ఇది బాలీవుడ్ మీద తెలుగు హీరోల దండయాత్ర!

ఈ మధ్యనే మా ఎన్నికలలో కనుక ప్రకాష్ రాజ్ గారు గెలిస్తే తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెడతానని.. ప్రకాష్ గారు గెలిస్తే తనకు నిర్భయంగా అన్యాయాన్ని బయటపెట్టే ధైర్యం వస్తుందనేలా మరో ట్వీట్ చేసింది. దీంతో పూనమ్ కు జరిగిన అన్యాయం ఏంటి.. అసలు అన్యాయం చేసిన వ్యక్తి ఎవరు అనే చర్చ సహజంగానే మొదలైంది. అదలా ఉండగానే ఇప్పుడు పీకే లవ్ అంటూ ఆమె పెట్టిన ట్వీట్ కూడా మరోసారి సంచలనంగా మారింది. మరి దాని అర్ధం ఆమెకే కదా తెలిసేది.