Amitabh Bachchan meet fans without slippers at his home Jalsa
Amitabh Bachchan : బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ 8 పదుల వయసు వచ్చినా ఆయన సినిమాలలో వేగం మాత్రం అసలు తగ్గడం లేదు. ఒక పక్క సినిమాలో నటిస్తూనే మరో పక్క టీవీ షోలు కూడా చేస్తూ యంగ్ జనరేషన్ కి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. కాగా అమితాబ్ ప్రతి ఆదివారం ముంబైలోని తన ఇంటి జల్సా వద్ద అభిమానులను కలుసుకుంటూ ఉంటారు. వారితో కాసేపు మాట్లాడి వారిని ఆనందపరుస్తుంటాడు. అయితే అమితాబ్ వారి దగ్గరకి వెళ్లే సమయంలో కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తారు.
Anantha : సినిమాకి వచ్చే ప్రతి రూపాయి ఒరిస్సా రైలు ప్రమాద సహాయ నిధికి.. ‘అనంత’ మూవీ నిర్మాత!
దానికి రీజన్ ఏంటో తాజాగా అమితాబ్ వెల్లడించారు. మనమంతా దేవుడి దగ్గరకి వెళ్ళినప్పుడు కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్తాము కదా? అలాగే తనని అభిమానించి ఇంతటి స్థాయిని అందించిన అభిమానులు తనకి దేవుళ్లతో సమానం అని, ఆ అభిమానులు ఎక్కడ ఉంటే అది తనకి దేవాలయం అని, అందుకే తాను చెప్పులు ధరించానని చెప్పుకొచ్చారు. ఇక ఈ విషయం తెలియడంతో అమితాబ్ పై అభిమానులకు మరింత ప్రేమ కలుగుతుంది. కాగా అమితాబ్ ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ (Prabhas) ప్రాజెక్ట్ K (Project K) సినిమాలో నటిస్తున్నారు.
నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ మూవీగా రాబోతుంది. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అమితాబ్ ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఇటీవల ఈ మూవీలోని యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తున్న సమయంలో అమితాబ్ కి గాయం అయ్యి.. ఈ మూవీ షూటింగ్ కొంత బ్రేక్ ఇచ్చారు. ఈ సినిమాలో దీపికా (Deepika Padukone), దిశా పటాని (Disha Patani) ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. కమల్ హాసన్ (Kamal Haasan) కూడా ఈ సినిమాలో ఒక పాత్ర చేస్తున్నాడని ఇటీవల వార్తలు వినిపించాయి. మరి ఆ వార్తలో నిజమెంత ఉందో తెలియదు.