Amitabh Bachchan Re Tweet on Rajinikanth's Tweet
Amitabh Bachchan: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మాస్, క్లాస్ అంటూ తేడా లేకుండా తన నటనతో గత నాలుగు దశాబ్దాలుగా ఇండియన్ మెగాస్టార్ ల చక్రం ఏలుతున్నాడు బిగ్-బి అమితాబ్ బచ్చన్. ఈ మంగళవారంతో అయన 80వ వసంతంలోకి అడుగుపెట్టగా, దేశవ్యాప్తంగా అమితాబ్ కు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి.
Amitabh Bachchan: అమితాబ్ బచ్చన్ నిర్మించిన ఏకైక తెలుగు సినిమా.. ఏంటో తెలుసా?
ఈ నేపథ్యంలోనే సూపర్ స్టార్ రజినికాంత్ ట్విట్టర్ వేదికగా అమితాబ్ ని పుగుడుతూ బర్త్ డే విషెస్ చెప్పాడు. “నాకు ఎప్పుడూ స్ఫూర్తినిచ్చే వ్యక్తి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక లెజెండ్ మరియు సూపర్ హీరో 80వ ఏట అడుగుపెడుతున్నారు. అమితాబ్ బచ్చన్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు” అంటూ రజిని ట్వీట్ చేశాడు.
ఆయనకు బదులిస్తూ బిగ్-బి.. “రజనీ సార్ మీరు నన్ను చాలా ఎక్కువగా పొగుడుతున్నారు. మీకు ఉన్న స్టార్ డమ్ మరియు మీ ప్రత్యేకమైన స్టైల్ తో నన్ను నేను పోల్చుకోలేను. మీరు కేవలం సహా నటుడు మాత్రమే కాదు, అత్యంత ప్రియమైన స్నేహితుడు కూడా” అంటూ రీ ట్వీట్ చేశాడు అమితాబ్.