Amitabh Bachchan: మొట్టమొదటి సొంత ఇంటిని అమ్మేసిన అమితాబ్!
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఇండియన్ సెలబ్రిటీలలోనే రిచ్చెస్ట్ పర్సన్ అని పేరు. అందుకు తగ్గట్లే బచ్చన్ భారీగానే ఆస్తులను కూడా బెట్టుకున్నారు.
- Naresh Mannam
- Published On : February 3, 2022 / 09:09 PM IST
Amitabh Bachchan
Amitabh Bachchan: బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ అంటే ఇండియన్ సెలబ్రిటీలలోనే రిచ్చెస్ట్ పర్సన్ అని పేరు. అందుకు తగ్గట్లే బచ్చన్ భారీగానే ఆస్తులను కూడా బెట్టుకున్నారు. ఒక్క ముంబైలోనే ఆయనకు ఐదారు సొంత బంగ్లాలు ఉండగా వాటికి జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని పేర్లు కూడా పెట్టుకున్నారు.
Ranga Ranga Vaibhavanga ఫస్ట్ సింగిల్.. తెలుసా తెలుసా ఎవరికోసం ఎవరు పుడతారో!
ముంబైలోని జుహులో ఈ ఐదు విశాలవంతమైన బంగ్లాలు ఉండగా.. గతేడాది అంధేరిలో సుమారు రూ.31 కోట్లు విలువచేసే మరో డూప్లెక్స్ ఫ్లాట్‌ని కూడా కొనుగోలు చేశారు. కాగా, ఆయనకి ఎన్ని బంగ్లాలు ఉన్నా ఆయన తొలి సొంత ఇల్లు ఆయనకి ప్రత్యేకం. అయితే ఇది ముంబైలో లేదు.. ఢిల్లీలో ఉంది. సౌత్ ఢిల్లీలో గల ఆ ఖరీధైన బంగ్లాకు ‘సోపాన్’ అని పేరు.
OTT Platforms: ఓటీటీల పోటీ.. స్ట్రీమింగ్ రైట్స్ కోసం కాంపిటీషన్
అందులో అమితాబ్ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ నివసించగా.. అమితాబ్ నటుడిగా మారకముందు.. ముంబైకి వచ్చేవరకు కూడా ఢిల్లీలోని ఆ ఇంట్లోనే ఉండేవారు. బచ్చన్ ఫ్యామిలీకి మొట్టమొదటి సొంతిల్లు కూడా అదే కాగా.. ఏమైందో ఏమో కానీ అమితాబ్ తాజాగా ఆ ఇంటిని అమ్మేశారు.
Films Releases: పెద్ద సినిమాలున్నా.. తగ్గేదేలే అంటున్న చిన్న సినిమాలు!
బచ్చన్ కుటుంబానికి చెందిన ఈ ఖరీదైన బంగ్లాను.. సోపాన్‌ను నెజోన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ సీఈవో అవని బడెర్ సుమారు రూ.23 కోట్లకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇంటికి కొన్న అవని బడెర్ బచ్చన్ కుటుంబానికి దశాబ్దాలుగా పరిచయం ఉన్న వ్యక్తి కాగా.. ఆ ఇంటికి దగ్గర్లోనే ఆయన నివాసం కూడా ఉంది. అయినా బచ్చన్ బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.
