Bodyguard: బిగ్ బీ నుంచి షారూఖ్ వరకూ బాడీగార్డులకు కోట్లలో జీతాలు
అమితాబ్ బచ్చన్ దగ్గర పనిచేసే బాడీగార్డ్ శాలరీ గురించి బయటకు తెలియడంతో అదొక క్రేజ్ గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన వార్తల ప్రకారం..

Body Gaurds
Bodyguard: అమితాబ్ బచ్చన్ దగ్గర పనిచేసే బాడీగార్డ్ శాలరీ గురించి బయటకు తెలియడంతో అదొక క్రేజ్ గా మారిపోయింది. రీసెంట్ గా వచ్చిన వార్తల ప్రకారం.. ముంబైలో హెడ్ కానిస్టేబుల్ అయినటువంటి జితేంద్ర సిన్హా సంవత్సరానికి అమితాబ్ నుంచి రూ.1.5కోట్లు డ్రా చేస్తున్నాడు. సిన్హా పోలీస్ వ్యక్తి అవడం వల్లే.. ఈ అవకాశం దక్కిందట.

Amitabh Bachchan
సాధారణంగా సెలబ్రిటీలు పబ్లిక్ అప్పీరియెన్స్ కు వెళ్లినప్పుడు జనాలు ఒకేసారి వచ్చి మీద పడకుండా వీళ్లే అడ్డుకుంటారు. అటువంటి సందర్భాల్లో సెక్యూరిటీ వాళ్ల చుట్టూనే ఉంటారు.
షారూఖ్ ఖాన్:
బాంద్రాలోని షారూఖ్ ఖాన్ (ఎస్ఆర్కే) ఇల్లు మన్నత్ బయట అతని బర్త్ డేకు ఎంత మంది ఉంటారో తెలుసుగా. దానిని బట్టే చెప్పొచ్చు. షారూఖ్ కు బాడీగార్డ్ ఎంత అవసరమో అని. చాలా సంవత్సరాలుగా అతనితో పాటు రవి సింగ్ అనే వ్యక్తి షారూఖ్ ను అభిమానుల ఆవేశం నుంచి కాపాడుతున్నాడు. ఇతనికి సంవత్సరానికి అందే జీతం రూ.2.7కోట్లు.

Sharukh Khan
సల్మాన్ ఖాన్:
బాలీవుడ్ లో పాపులర్ బాడీగార్డ్ గా వినిపించే పేరు షెరా. కొన్ని సినిమాల్లోనూ కనిపించిన ఈ బాడీగార్డ్.. షారూఖ్ ఖాన్ కు నీడే అని చెప్పాలి. సల్మాన్ ఖాన్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ చూసినట్లే ఉంటుంది షెరా అకౌంట్ కూడా. సల్మాన్ తన బ్రాండ్ beinghuman అని ప్రమోషన్ చేసుకున్నట్లు beingsheraఅని పెట్టుకున్నాడు. అతని జీతం సంవత్సరానికి రూ.2.5కోట్లు.

Salman Khan
అక్షయ్ కుమార్:
అక్షయ్ కాంబో ప్యాక్ వాడుతున్నట్లు కనిపిస్తుంది. ఎందుకంటే పబ్లిక్ అప్పీరియెన్స్‌లో ఒక్కోసారి అక్షయ్ కొడుకు ఆరవ్‌ను కూడా ప్రొటెక్ట్ చేస్తుంటాడు శ్రేసే. ఇతని సంవత్సర జీతం రూ.1.2కోట్లు.

Akshay Kumar
అమీర్ ఖాన్:
యువరాజ్ ఘోర్పదె అనే వ్యక్తి అమీర్‌ఖాన్‌కు బాడీగార్డ్ గా వ్యవహరిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీల బాడీగార్డుల్లో రిచ్ పర్సన్ అంటే ఇతనే. తొమ్మిదేళ్ల క్రితం Ace Securitiesలో జాయిన్ అయ్యేంతవరకూ పలు జాబ్ లు చేసేవాడిని. ఇప్పుడు యాక్టర్ – ప్రొడ్యూసర్ – డైరక్టర్ అమీర్ ఖాన్ దగ్గర పనిచేస్తున్నా. నా స్నేహితులంతా ఈ అవకాశం కోసం ఎదురుచూస్తుంటారు’ అని గోర్ఫదె చెప్పుకొచ్చాడు. అతని సంవత్సరం జీతం రూ. 2కోట్లు.

Amir Khan
అనుష్క శర్మ, దీపికా పదుకొణె:
అనుష్క శర్మ ప్రస్తుతం ఇంగ్లాండ్ లో విరాట్ కోహ్లీతో పాటు ఉన్నారు. ఇండియాలో ఉన్నప్పుడు ఆమెకు సోనూ అనే వ్యక్తి బాడీగార్డ్ గా వ్యవహరిస్తుంటారు. ఇతని జీతం సంవత్సరానికి రూ.1.2కోట్లు. ఇంటరెస్టింగ్ విషయమేంటంటే.. దీపికా పదుకొణె బాడీగార్డ్ జలాల్ తీసుకునేది కూడా రూ.1.2కోట్లే.

Deppika