చేహరే – ఫస్ట్ లుక్

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి 'చేహరే' ఫస్ట్ లుక్ రిలీజ్..

  • Published By: sekhar ,Published On : May 13, 2019 / 10:31 AM IST
చేహరే – ఫస్ట్ లుక్

Updated On : May 13, 2019 / 10:31 AM IST

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘చేహరే’ ఫస్ట్ లుక్ రిలీజ్..

బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీకి ‘చేహరే’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ, ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది మూవీ యూనిట్. రూమీ జాఫ్రీ దర్శకత్వంలో, మోషన్ పిక్చర్స్ అండ్ సితార ఎంటర్ టైన్‌మెంట్ ప్రై.లి. నిర్మిస్తున్నాయి. ఇమ్రాన్ హష్మీ, కృతి కర్బందా కీలక పాత్రలు పోషిస్తున్నారు. తెల్లటి జుట్టు, తెల్ల గెడ్డం, ఆ గెడ్డాన్ని ముడివేయడం, కళ్ళజోడు, తలకి మంకీ క్యాప్ లాంటి టోపీతో ఆకట్టుకునేలా ఉంది అమితాబ్ లుక్..

మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ముంబాయిలో స్టార్ట్ అయ్యింది. ‘బిగ్ బీతో కలిసి నటించడం చాలా హ్యాపీగా ఉంది, 46 ఏళ్ళ క్రితం మా నానమ్మ జంజీర్ సినిమాలో అమితాబ్ గారికి తల్లిగా నటించారు’ అంటూ  చెప్పుకొచ్చాడు ఇమ్రాన్ హష్మీ. 2020 ఫిబ్రవరి 21న చేహరే విడుదల కానుంది.