1000 Waala : టైటిల్ ‘1000 వాలా’.. బాగా పేలుతుందా మరి?

గతంలో టెన్ రూపీస్ సినిమాతో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించిన అఫ్జల్ 1000 వాలా సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు.

1000 Waala : టైటిల్ ‘1000 వాలా’.. బాగా పేలుతుందా మరి?

Amith 1000 Wala Movie First Look Released

Updated On : May 28, 2024 / 5:19 PM IST

1000 Waala : ఇటీవల పలువురు కొత్త నటీనటులు, సాంకేతిక సిబ్బంది పరిచయం అవుతూ సినిమాలు చాలానే వస్తున్నాయి. తాజాగా సూపర్ హిట్ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై షారుఖ్ నిర్మాణంలో నూతన నటుడు అమిత్ హీరోగా పరిచయం అవుతూ తెరకెక్కిస్తున్న సినిమా 1000 వాలా. అమిత్, షారుఖ్, నమిత, కీర్తి, సుమన్, పిల్లా ప్రసాద్, ముఖ్తార్ ఖాన్.. పలువురు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

గతంలో టెన్ రూపీస్ సినిమాతో ఒక కొత్త కాన్సెప్ట్ తో ప్రేక్షకులను పలకరించిన అఫ్జల్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో షూటింగ్ మొదలుపెట్టకముందు ఓ చిన్న గ్లింప్స్ షూట్ చేసి రిలీజ్ చేసారు. ప్రస్తుతం ఈ 1000 వాలా సినిమా షూట్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

Also Read : Bhaje Vaayu Vegam : ఎడిటింగ్ అయ్యాక హార్డ్ డిస్క్‌లు క్రాష్.. మళ్ళీ మొదట్నుంచి.. ‘భజే వాయువేగం’ సినిమా నాలుగేళ్ల కష్టాలు..

తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు. ఈ సందర్భంగా దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. 1000 వాలా సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసాం. సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. ఫస్ట్ కాపీ త్వరలోనే రెడీ అవుతుంది. త్వరలో రిలీజ్ డేట్ ప్రకటిస్తాము అని తెలిపారు. మరి టైటిల్ కి తగ్గట్టు ఈ 1000 వాలా ఏ రేంజ్ లో పేలుతుందో చూడాలి.