Amithab Bachchan : అమితాబ్ కాలికి గాయం.. అయినా షూటింగ్ లో పరిగెత్తుతూ..

అమితాబ్ తన బ్లాగ్ లో దీని గురించి రాశారు. అమితాబ్.. ''నా ఎడమ కాలికి గాయమైంది. ఒక ఇనుప ముక్క నా కాలి వేళ్ళని చీల్చడంతో బాగా బ్లడ్ కూడా వచ్చింది. కుట్లు కూడా పడ్డాయి. డాక్టర్స్ అసలు...............

Amithab Bachchan : అమితాబ్ కాలికి గాయం.. అయినా షూటింగ్ లో పరిగెత్తుతూ..

Amithab Bachchan leg injury but participated in shoot

Updated On : October 24, 2022 / 11:20 AM IST

Amithab Bachchan :  80 ఏళ్ళు వచ్చినా ఇంకా యాక్టీవ్ గా షూటింగ్స్ లో బిజీబిజీగా ఉంటున్నారు అమితాబ్ బచ్చన్. ఒకపక్క సినిమాల్లో నటిస్తూ, మరోపక్క కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాంని హోస్ట్ చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా అంత యాక్టీవ్ గా కష్టపడటం ఆయనకే చెల్లింది. తాజాగా తన ఎడమ కాలికి గాయం అయినా, డాక్టర్స్ నడవొద్దన్నా, షూటింగ్స్ లో చాలా యాక్టివ్ గా పాల్గొనడంతో అందరూ ఆశ్చర్యపోయారు.

అమితాబ్ తన బ్లాగ్ లో దీని గురించి రాశారు. అమితాబ్.. ”నా ఎడమ కాలికి గాయమైంది. ఒక ఇనుప ముక్క నా కాలి వేళ్ళని చీల్చడంతో బాగా బ్లడ్ కూడా వచ్చింది. కుట్లు కూడా పడ్డాయి. డాక్టర్స్ అసలు నడవద్దన్నారు. కానీ అలాగే కట్టు కట్టుకొని కౌన్‌ బనేగా కరోడ్‌పతి షూటింగ్ లో పాల్గొన్నాను” అని తెలిపారు.

Kohli : పాక్ పై భారత్ విజయం.. కోహ్లీకి అభినందనలు చేస్తూ సినీ సెలబిటీల ట్వీట్లు..

ఆ షూట్ లో నడవడమే కాకుండా, పరిగెత్తడం కూడా చేశారు. ఆ ప్రోగ్రాంలో పరిగెత్తుతున్న ఫోటోలని కూడా తన బ్లాగ్ లో షేర్ చేశారు. ఒక పక్క దెబ్బ తగిలి ఉన్నా, డాక్టర్స్ నడవద్దు అన్నా, షో కోసం పరిగెత్తడం చూసి ఆయనకి వర్క్ మీద ఉన్న డెడికేషన్ ని మరోసారి అందరూ అభినందిస్తున్నారు. అలాగే జాగ్రత్తగా ఉండమని ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.