Akhanda Amma Song : ఎమోషనల్‌గా ఆకట్టుకుంటున్న ‘అఖండ’ ‘అమ్మ’ సాంగ్..
‘అఖండ’ నుండి ఎమోషనల్ ‘అమ్మ’ వీడియో సాంగ్ రిలీజ్..

Amma Full Video Song
Akhanda Amma Song: గత 47 రోజులుగా బాక్సాఫీస్ బరిలో బాలయ్య ‘అఖండ’ గర్జన కొనసాగుతోంది. ‘సింహా’, ‘లెజెండ్’ వంటి భారీ బ్లాక్‌బస్టర్స్ తర్వాత నటసింహా నందమూరి బాలకృష్ణ, ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుల క్రేజీ కాంబినేషన్లో వచ్చిన హ్యాట్రిక్ మూవీ ‘అఖండ’..
NTR 30 : ట్రెండింగ్‌లో తారక్ 30
గత ఏడు వారాలుగా బాక్సాఫీస్ బరిలో సత్తా చాటుతూ విజయవంతంగా 50 రోజులవైపు పరుగులు తీస్తుంది. సంక్రాంతి కానుకగా ‘అఖండ’ టైటిల్ సాంగ్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్గా ‘అమ్మ’ సాంగ్ విడుదల చేశారు.
Balakrishna : గుర్రమెక్కిన ‘నటసింహం’.. నందమూరి ‘యువసింహం’..
థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘‘ధర్మం కోసం దూరం అయితే ఒకడూ.. దైవం అంటూ దారే మారేనొకడూ.. అమ్మా అంటూ పిలిచే వాడే లేకా.. ఎందుకంటా, సామీ జన్మా.. సావు రాకా’’.. అంటూ రచయిత కళ్యాణ్ చక్రవర్తి అమ్మ బాధను వర్ణిస్తూ కంటతడి పెట్టించేలా లిరిక్స్ రాశారు. మోహనా భోగరాజు అద్భుతంగా పాడారు. సినిమాలో ఈ ఎమోషనల్ సాంగ్ వస్తున్నంత సేపు ప్రేక్షకులు భావోద్వేగానికి గురయ్యారు.
Unstoppable : మద్యం మీద పద్యం.. బాలయ్య మామూలోడు కాదయ్యో!
Unstoppable with NBK : బాలయ్య దెబ్బకి ‘థింకింగ్’ మారిపోతుందని ముందే చెప్పాం-‘ఆహా’ టీం
మిర్యాల సత్యనారాయణ రెడ్డి సమర్పణలో ద్వారకా క్రియేషన్స్ పతాకంపై యువ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించిన ‘అఖండ’ సెకండ్ వేవ్ తర్వాత సెన్సేషన్ క్రియేట్ చెయ్యడమే కాకుండా విడుదలైన ప్రతి సెంటర్లోనూ బాలయ్య కెరీర్లో హయ్యస్ట్ కలెక్షన్లు రాబట్టి, జనవరి 20 నాటికి 50 రోజులు పూర్తి చేసుకోబోతుంది.