అమృత -మారుతీ రావుపై ‘వర్మ’ సినిమా..’మర్డర్’‌ ఫస్ట్‌లుక్‌

  • Publish Date - June 22, 2020 / 01:08 AM IST

నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య ఘటనపై సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సినిమా తీస్తున్నాడు. అమృత -మారుతీ రావుల నేపథ్యంలో సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మేరకు వర్మ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. దీనికి ఆయన ‘మర్డర్’ అనే టైటిల్ ను ఖరారు చేశారు.

ఈ చిత్రానికి ‘కుటుంబ కథా చిత్రమ్’ అనే క్యాప్షన్ అని వర్మ పెట్టడం విశేషం. వాస్తవ ఘటనల ఆధారంగా వర్మ సినిమాను తెరకెక్కిస్తున్నారు. 2020, జూన్ 21వ తేదీ Fathers Day కాబట్టి..సినిమాకు సంబంధించి పోస్టర్ ను విడుదల చేశారు. ఫొటోలో…మారుతీ రావు, అమృతలతో పోలికలతో ఉన్న వ్యక్తులు ఉండడం కనిపిస్తోంది. 

ప్రణయ్ – అమృత లవ్ మ్యారేజ్, అనంతరం ప్రేమ – పగ మధ్య జరిగిన ఘర్షణలో ఇద్దరు వ్యక్తులు ప్రాణాలు ఎలా కోల్పోయారు ? మారుతీ రావు ఆత్మహత్యకు సంబంధించిన అంశాలను వర్మ తెరకెక్కిస్తున్నారు. వర్మ సమర్పణలో వస్తున్న ఈ సినిమాకు నట్టి కరుణ, క్రాంతి నిర్మాతలుగా ఉన్నారు. ఆనంద్ చంద్ర దర్శకత్వం వహిస్తుండగా..మారుతీ రావు పాత్రలో శ్రీకాంత్ అయ్యంగార్ నటిస్తున్నారు. 

మిర్యాలగూడకు చెందిన మారుతీరావు తన కూతురు అమృత.. ప్రణయ్‌ అనే వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నదన్న కారణంతో అల్లుడిని హత్య చేయించాడు. 2020, మార్చి 08వ తేదీ ఖైరతాబాద్‌లోని ఆర్యవైశ్య భవన్‌లో అమృత తండ్రి మారుతీరావు ఉరి వేసుకుని చనిపోవడం కలకలం సృష్టించింది. 

గిరిజ నన్ను క్షమించు..అమృత..ఇంటికి రా..అని ఓ లేఖ అక్కడ కనిపించింది. మారుతీరావు అంత్యక్రియలకు భారీ పోలీసు బందోబస్తుతో అమృత వచ్చింది. కానీ..బంధువులు అందుకు అంగీకరించలేదు. దీంతో అమృత తిరిగి వెనక్కి వెళ్లిపోయింది. ఈ క్రమంలో..తల్లిని 2020, మార్చి 14వ తేదీ శనివారం అమృత కలిసింది. 

2018, జనవరి 31 ప్రణయ్, అమృతలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు
2018, సెప్టెంబర్‌ 14న రియల్ ఎస్టేట్ వ్యాపారి అయిన..మారుతీ రావు..ప్రణయ్‌ని అతి దారుణంగా హత్య చేయించాడు.
జూన్ 12వ తేదీన పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. 1600 పేజీల ఛార్జీషీట్‌ను న్యాయస్థానంలో సమర్పించారు. 
కూతురు తండ్రి మారుతీ రావు, బాబాయ్ శ్రవణ్, ఎంఏ కరీం, అస్గర్ ఆలీ, అబ్దుల్ బారీ, సుభాష్ శర్మలను పోలీసులు అరెస్టు చేశారు. 
మారుతీ రావు(ఆత్మహత్య చేసుకున్నాడు), శ్రవణ్, కరీం బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. 
 

Read:  యోగా డే స్పెషల్.. సితార పాప సింపుల్ ఆసనాలు