Amul Created Farhan Akhtar Toofan Cartoon
Toofaan: వాడుకున్నోడి వాడుకున్నంత.. మడిసన్నాక కాసింత కళాపోషణుండాలి.. ఈ మాటలు అమూల్ బ్రాండ్ యాజమాన్యానికి సరిగ్గా సరిపోతాయి. ఎందుకంటే గతకొద్ది రోజులుగా తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం సోషల్ మీడియాలో వాళ్లు చేసే హంగామా వేరే లెవల్లో ఉంటుంది. ఇటీవల కోక్ ఇష్యూను తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం వాడుకున్న అమూల్.. తర్వాత ‘షేర్ని’ మూవీలో విద్యా బాలన్ క్యారెక్టర్‌ని కూడా వాడేసుకుంది. ఇప్పుడు అమూల్ కన్ను మరో బాలీవుడ్ బొమ్మపై పడింది. ఆ మూవీ ‘తూఫాన్’.
Vidya Balan : అమూల్ ప్రమోషన్ కోసం ‘షేర్ని’.. విద్యా బాలన్ రియాక్షన్ ఏంటంటే..
ఫర్హాన్ అక్తర్ హీరోగా కిక్ బాక్సింగ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన లవ్, యాక్షన్ అండ్ స్పోర్ట్స్ ఫిలిం ‘తూఫాన్’ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మూవీలో అజీజ్ అలీ క్యారెక్టర్‌లో ఫర్హాన్ పర్మాఫర్మెన్స్‌కి మంచి అప్లాజ్ వచ్చింది. ‘తూఫాన్’ ని ‘TOO FAN’ గా విడదీసి..‘Main Bhi Fan’ అంటూ ప్రమోట్ చేసుకుంది అమూల్ బ్రాండ్..
#Amul Topical: Bollywood sports drama makes waves on OTT… pic.twitter.com/N1zNpYHPZC
— Amul.coop (@Amul_Coop) July 19, 2021
బాక్సింగ్ రింగ్‌లో ఒక చేత్తో బటర్ నైఫ్, మరో చేత్తో బ్రెడ్ స్లైసెస్ పట్టుకుని ఉన్న అజీజ్ అలీ కార్టూన్ క్యారెక్టర్ పోస్టర్‌ను ‘This Box Packs a Punch!’ అనే కొటేషన్‌తో అమూల్ బ్రాండ్ అఫీషియల్ సోషల్ మీడియా అకౌంట్స్‌లో షేర్ చేశారు. ఈ పిక్ నెటిజన్లను భలే ఆకట్టుకుంటోంది. అమూల్ క్రియేట్ చేసిన తన కార్టూన్ క్యారెక్టర్ పోస్టర్‌ను ఫర్హాన్ ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేశారు.