ఎవడు,ఐ వంటి సినిమాలతో తెలుగు ఆడియన్స్ ను తన అందచందాలతో ఆకట్టుకున్న హీరోయిన్ అమీ జాక్సన్ తల్లి కాబోతున్నారు. బ్రిటన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త జార్జ్ పనాయొటోతో అమీ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. న్యూఇయర్ సందర్భంగా జాంబియాలో వీరిద్దరూ నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. అయితే ఇంకా పెళ్లి చేసుకోలేదు.యూకేలో ఆదివారం(మార్చి-31,2019) మదర్స్ డే సందర్భంగా తాను తల్లి కాబోతున్నట్లు అమీ ఇన్ స్టాగ్రామ్ ద్వారా ప్రకటించారు.మీ అందరికీ ఈ విషయాన్ని అరిచి మరీ చెప్పాలని ఎదురుచూస్తున్నాను. మాతృదినోత్సవానికి మించిన సరైన రోజు మరొకటి ఉండదు.
ఈ ప్రపంచంలో అందరి కంటే ఎక్కువగా నిన్ను (కడుపులోని బిడ్డను ఉద్దేశిస్తూ) ప్రేమిస్తున్నాను. నిన్ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నాం’ అని అమీజాక్సన్ తన పోస్ట్ లో తెలిపారు. కాబోయే భర్తతో కలిసి దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నారు.అమీ ప్రకటనతో అభిమానుల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.