Amy Jackson : బాబు పుట్టాక ప్రియుడితో బ్రేకప్..!

సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ బాబు పుట్టిన రెండేళ్లకు ప్రస్తుత ప్రియుడు, కాబోయే భర్తతో అమీ జాక్సన్ బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి..

Amy Jackson : బాబు పుట్టాక ప్రియుడితో బ్రేకప్..!

Amy Jackson

Updated On : July 27, 2021 / 5:41 PM IST

Amy Jackson: నటీనటులు మేకప్ తీసినంత ఈజీగా పెళ్లిళ్లు, రిలేషన్లు బ్రేకప్ చేసుకుంటారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పోర్న్ స్టార్ మియా ఖలీఫా భర్తతో విడిపోతున్నట్లు అనౌన్స్ చేసిన సంగతి మర్చిపోకముందే మరో నటి కూడా కాబోయే భర్తతో బ్రేకప్ చేసుకుందనే వార్త తెలియడంతో ఇలాంటి కామెంట్స్ వస్తున్నాయి.

Amy Jackson

ఇంతకీ ఆ నటి ఎవరో కాదు.. అమీ జాక్సన్.. ‘ఎవడు’, ‘ఐ’, ‘2.O’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకుందీ బ్రిటీష్ నటి, మోడల్.. కెరీర్ ఫుల్ స్వింగ్‌లో ఉండగానే జార్జ్ పనాయిటోతో ప్రేమలో పడింది. పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి ఎంగేజ్‌మెంట్ కూడా చేసేసుకుంది. కట్ చేస్తే కోవిడ్ కారణంగా పెళ్లి పోస్ట్ పోన్ అయ్యింది. ఇంతలోనే ఓ బాబుకి జన్మనిచ్చింది కూడా.
అయితే సడెన్‌గా ఏమైందో తెలియదు కానీ బాబు పుట్టిన రెండేళ్లకు ప్రస్తుత ప్రియుడు, కాబోయే భర్తతో బ్రేకప్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అమీ, జార్జ్‌తో విడిపోయింది అనే మాట నిజమే అన్నట్లు సోషల్ మీడియాలో అతని పిక్స్ అన్నీ డిలీట్ చేసేసింది. కారణం లేకుండా ఫోటోలు ఎందుకు డిలీట్ చేస్తుంది..? ప్రియుడితో విడిపోవడం వల్లనే కదా.. పెళ్లి ముచ్చట తీరకుండానే బాబుకి కూడా జన్మనిచ్చి ఇప్పుడు విడిపోయింది పాపం అంటూ నెటిజన్స్ జాక్సన్‌పై జాలి చూపిస్తూ కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Amy Jackson (@iamamyjackson)