Amy Jackson : ఇండియా వంటి దేశం మరెక్కడా ఉండదు.. అమీ జాక్సన్ ఎమోషనల్ పోస్ట్..

బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్.. ఇండియా వంటి దేశం మరెక్కడా ఉండదు అంటూ సోషల్ మీడియాలో ఎమోషనల్ వేసింది.

Amy Jackson emotional post about India on Independence day

Amy Jackson : బ్రిటన్ బ్యూటీ అమీ జాక్సన్.. తమిళ్ హీరో ఆర్య నటించిన ‘మదరాసీపట్టణం’ (తెలుగులో 1947: A Love Story) సినిమాలో హీరోయిన్ గా నటించి ఇక్కడ ఆడియన్స్ కి పరిచయం అయ్యింది. ఆ సినిమా మంచి విజయానే తెచ్చిపెట్టింది. ఇక ఆ తరువాత హిందీ, తెలుగు, కన్నడ భాషల్లో అవకాశాలు అందుకుంటూ వచ్చింది. ప్రస్తుతం తమిళంలో అరున్ విజయ్ హీరోగా తెరకెక్కుతున్న ‘మిషన్’ అనే సినిమాలో నటిస్తుంది. యాక్షన్ మూవీగా రాబోతున్న ఈ సినిమా రెండు భాగాలుగా తెరకెక్కుతుంది.

Saif Ali Khan : దేవర అప్డేట్.. సముద్ర జలాల్లోంచి భైరా వచ్చేశాడు..

ఇది ఇలా ఉంటే, తాజాగా ఈ భామ ఆగష్టు 15 ఇండిపెండెన్స్ రోజునాడు తన సోషల్ మీడియాలో ఇండియాని ఉదేశిస్తూ ఎమోషనల్ పోస్ట్ వేసింది. “మదరాసీపట్టణం సినిమాలో నటించడం వాళ్ళ అందమైన భారతదేశం మొత్తాన్ని చూడగలిగాను. నాకు ఆ సినిమాలో అవకాశం ఇచ్చిన రైటర్ అండ్ డైరెక్టర్ విజయ్ కి ఎప్పటికి రుణపడి ఉంటాను. ఆ సినిమా అవకాశం నా కెరీర్ కి ఒక కిక్ స్టార్ట్ అయ్యింది. అప్పటి నుంచి ఇండియా నాకు రెండో ఇల్లు అయ్యిపోయింది. ఇక్కడ ఫ్రెండ్స్ నాకు ఫ్యామిలీ మెంబెర్స్ అయ్యిపోయారు. ఇక్కడ పొందిన అనుభూతి, లెక్కపెట్టలేనని జ్ఞాపకాలు నాకు ఈ దేశం ఇచ్చింది. ఇండియా వంటి దేశం మరెక్కడా ఉండదు. హ్యాపీ ఇండిపెండెన్స్ డే” అంటూ ఎమోషనల్ ట్వీట్ వేసింది.

Sreeleela : ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయబోతున్న శ్రీలీల..

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఇండియాని ఇంతలా పొగిడేస్తూ పోస్ట్ వేసిన అమీ జాక్సన్ ఒక బ్రిటిష్ పౌరసత్వం ఉన్న వ్యక్తి కావడం. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ తెగ వైరల్ అవుతుంది. ఇక అమీ కెరీర్ విషయానికి వస్తే.. రజినీకాంత్, విజయ్, రామ్ చరణ్, విక్రమ్, సుదీప్, ధనుష్.. వంటి స్టార్ హీరోల సరసన నటించినా కెరీర్ కి బూస్ట్ ఇచ్చే సినిమా మాత్రం అందుకోలేకపోయింది.