Sreeleela : ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయబోతున్న శ్రీలీల..

ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేయబోతుంది. శ్రీలీల నేడు వైజాగ్ వచ్చి ఈ ఈవెంట్ లో సందడి చేయబోతుంది.

Sreeleela : ఆంధ్రా ప్రీమియర్ లీగ్.. లాంచ్ చేయబోతున్న శ్రీలీల..

Andhra Premier League launching by Sreeleela in Vizag

Updated On : August 16, 2023 / 12:24 PM IST

Sreeleela : ఏపీ ప్రభుత్వం(AP Government) గత సంవత్సరం నుంచి ఆంధ్రా ప్రీమియర్ లీగ్(Andhra Premier League) నిర్వహిస్తుంది. ఆరు టీమ్స్ తో ఆంధ్రా ప్రీమియర్ లీగ్ సీజన్ 2 ఈ సంవత్సరం జరగనుంది. ఆగస్టు 16 నుంచి ఆగస్టు 26 వరకు ఈ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ వైజాగ్ లో జరగనుంది. వైజాగ్ లోని YS రాజశేఖర్ రెడ్డి స్టేడియంలో నేడు ఆగస్టు 16 సాయంత్రం ఆంధ్రా ప్రీమియర్ లీగ్ గ్రాండ్ లాంచ్ ఈవెంట్ జరగబోతుంది.

ఇక ఈ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ ఈవెంట్ ని హీరోయిన్ శ్రీలీల లాంచ్ చేయబోతుంది. శ్రీలీల నేడు వైజాగ్ వచ్చి ఈ ఈవెంట్ లో సందడి చేయబోతుంది. శ్రీలీలతో పాటు పలువురు సినీ, టీవీ, రాజకీయ ప్రముఖులు కూడా ఈ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లాంచ్ ఈవెంట్ కు రానున్నారు. దీంతో క్రికెట్ అభిమానులతో పాటు, శ్రీలీల ఫ్యాన్స్ కూడా స్టేడియంకు భారీగా రానున్నారు.

Samantha : సమంత ఇకపై కుర్ర హీరోలతోనే సినిమాలు చేస్తుందా? వన్ ఇయర్ బ్రేక్ తర్వాత సినిమాలకు ఇప్పట్నుంచే ప్లాన్??

ఇక ఈ ఆంధ్రా ప్రీమియర్ లీగ్ లో ఆరు టీమ్స్ ఉన్నాయి. కోస్టల్ రైడర్స్, గోదావరి టైటాన్స్, ఉత్తరాంధ్ర లయన్స్, రాయలసీమ కింగ్స్, వైజాగ్ వారియర్స్, బెజవాడ టైగర్స్ అనే టీమ్స్ తో పోటీ పడనున్నారు. ఇందులో లోకల్ ప్లేయర్స్ తో పాటు వేరే రాష్ట్రాల ప్లేయర్స్ కూడా ఉన్నారు.